గుండు సూదిపై రాకెట్
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై జీఎస్‌ఎల్వీ–ఎఫ్10 రాకెట్ నమూనాను అమర్చి ఔరా అనిపించారు. శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ–ఎఫ్10 రాకెట్‌ను స్ఫూర్తిగా తీసుకొని మైక్రో ఆర్టుతో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు.
గుండు సూది పైభాగంలో బంగారంతో 5 మిల్లీమీటర్ల ఎత్తు, 1.5 మిల్లీమీటర్ల వెడల్పుతో రూపొందించారు. రాకెట్ చివరి భాగంలో భారతదేశం జెండా ఏర్పాటు చేశారు. రాకెట్‌ను తయారుచేయడానికి రెండు రోజుల సమయం పట్టిందన్నారు.
అప్‌డేట్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్10 వాహకనౌక ప్రయోగం విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment