
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ బాసటగా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షల విధిస్తున్నాయి. అయితే.. భారత్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత అనుసరిస్తున్న తీరపై రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. తాజాగా రష్యాతో భారత్‌కి ఉన్న స్నేహబంధం ఎలాంటిదో నిరూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరు మారలేదని కొన్ని దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా రష్యా తాను చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగాలకూ పలు దేశాలను సహాయం అందించకూడదనే ఆలోచనలో ఉంది. అంతేకాదు వన్‌వెబ్ రాకెట్‌పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. బైకనోర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగస్వామ్యంతో 36 వన్ వెబ్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్ జెండాలను తొలగించిన రష్యా.. భారత్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది.
అంతేకాకుండా రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మందుకంటే అందంగా ఉందని తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Стартовики на Байконуре решили, что без флагов некоторых стран наша ракета будет краше выглядеть. pic.twitter.com/jG1ohimNuX
— РОГОЗИН (@Rogozin) March 2, 2022
Comments
Please login to add a commentAdd a comment