మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది! | Indian flag upside down at Modi-Abe meet | Sakshi
Sakshi News home page

మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!

Published Sat, Nov 21 2015 3:10 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది! - Sakshi

మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!

కౌలాలంపూర్: కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది.

చర్చలకు ముందు లాంఛనంగా మోదీ-అబె కరచాలనం చేస్తుండగా.. వారి వెనుక రెండు దేశాలు జెండాలు ఎగరేసి ఉన్నాయి. భారత జాతీయ త్రివర్ణ పతాకంలో మొదట కాషాయ  వర్ణం, మధ్యలో తెలుపు రంగు, చివరన ఆకుపచ్చ వర్ణం ఉంటాయి. తిరగేసి ఎగురవేయడంతో మొదట ఆకుపచ్చ రంగుతో జాతీయ జెండా కనబడింది. అధికార వర్గాలు ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేయడంతో ఏమారపాటు వల్లో, ఆ జాగ్రత్త వల్లో ఇలా జరిగిందని, ఇది దురదృష్టకరమని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కౌలాలంపూర్‌లో జరుగుతున్న 13వ ఆసియన్-భారత్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- జపాన్ ప్రధాని అబెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement