జాతీయ జెండాను అవమానించిన చైనా | Chinese’ shoes packed in tri-colour boxes raise furore in Uttarakhand’s Almora | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాను అవమానించిన చైనా

Published Sat, Aug 26 2017 6:49 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

జాతీయ జెండాను అవమానించిన చైనా

జాతీయ జెండాను అవమానించిన చైనా

అల్మోరా: భారత్‌, చైనాల సంబంధాలపై డోక్లాం వివాదం ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా మరో క్షమించరాని తప్పు చేసింది. సగటు భారతీయుడు గౌరవంగా చూసుకునే జాతీయ జెండాను బూట్ల డబ్బాలపై ముద్రించింది. ఈ దురదృష్టకర ఘటన ఉత్తరాఖండ్‌ అల్మోరాలో చోటు చేసుకుంది.

చైనా నుంచి వచ్చిన బూట్ల డబ్బాలపై మన జాతీయ పతాకంలో ఉండే మూడు రంగులతో బొమ్మలు ఉన్నాయని స్థానిక దుకాణదారుడు పోలీసులను ఫిర్యాదు చేశారు. బూట్లను పంపిన పెట్టెల పైభాగంలో మూడు రంగుల జెండా, అడుగున మాండరిన్‌ భాషలో పదాలు రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డోక్లామ్‌ వివాదం నేపథ్యంలో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా చైనా మరో కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు.

కిరాణా దుకాణదారుడు చేసిన ఫిర్యాదు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు అల్మోరా సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్పీ) రేణుకా దేవి తెలిపారు. బూట్లను దుకాణదారుడికి సరఫరా చేసిన రుద్రపూర్‌లోని తమ్మన ట్రేడర్స్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు ఉద్దమ్‌ సింగ్‌నగర్‌ ఎస్‌ఎస్‌పీ సదానంద్‌ దతే చెప్పారు. న్యూఢిల్లీలోని సరఫరాదారు నుంచి తెప్పించామని, ఎక్కడ ఉంటారనే విషయం తమకు తెలియదని ట్రేడర్స్‌ యాజమాన్యం చెప్పినట్లు ఎస్‌ఎస్‌పీ వివరించారు. త్వరలోనే న్యూఢిల్లీ సరఫరాదారును గుర్తించి ప్రశ్నిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement