లండన్‌లోని భారత హైకమిషనర్ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్ తక్షణ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్‌లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్‌కు నిరసనగా.. లండన్ హైకమిషనర్ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లండన్ అల్డివిచ్ ఇండియా హౌజ్ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్‌లో పోస్ట్ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్‌కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన.
“Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation.Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf
— Jaiveer Shergill (@JaiveerShergill) March 20, 2023
ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్ అధికారులు తక్షణం స్పందించారు. కౌంటర్‌గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్ ప్రశసంలు గుప్పిస్తున్నారు.
ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టియానా స్కాట్‌కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్ అహ్మద్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు.
Salute to the Brave Indian High Commission Official 🙏🇮🇳
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2023
He not only took back the Indian flag but stopped the extremist from installing the K-Flag.#UK #London pic.twitter.com/4X0DJQo9hV
ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం
Comments
Please login to add a commentAdd a comment