కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది.