
రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు విజయ పథంలో దూసుకుపోతుంది. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన భారత్.. వరుసగా మూడో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్పెషల్ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ చండీమాల్ క్యాచ్ పట్టిన రోహిత్.. టీ20ల్లో 50 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.
50 క్యాచ్‌లతో రోహిత్ తొలి స్దానంలో ఉండగా.. విరాట్ కోహ్లి 44 క్యాచ్‌లతో రెండో స్దానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచంలో రోహిత్ నాలుగో స్ధానంలో నిలిచాడు. అదే విధంగా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును కూడా ఈ మ్యాచ్‌లో సాధించాడు. స్వదేశంలో టి20 కెప్టెన్‌గా 16వ విజయం సాధించిన హిట్ మ్యాన్.. స్వదేశంలో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.
చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment