కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. కాగా స్క్వేర్-లెగ్‌లో అంపైర్‌గా ఉన్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే తను ఫీల్డర్ కాదని అంపైర్ అని గ్రహించి అఖరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో అంపైర్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధర్మసేన ఇప్పుడు అంపైర్‌గా కాదు శ్రీలంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది.
చదవండి: IND vs ENG 5th Test: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..!
Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy
— Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022
Comments
Please login to add a commentAdd a comment