kumara dharmasena
-
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు. నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది. అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా. అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను. ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. కాగా స్క్వేర్-లెగ్‌లో అంపైర్‌గా ఉన్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తను ఫీల్డర్ కాదని అంపైర్ అని గ్రహించి అఖరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంపైర్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధర్మసేన ఇప్పుడు అంపైర్‌గా కాదు శ్రీలంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: IND vs ENG 5th Test: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy — Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022 -
ఆ అంపైర్ మళ్లీ వచ్చాడు... కివీస్ గెలవడం కష్టమే
Waim Jaffer Trolls Umpire Kumar Dharmasena ENG vs NZ Semi FinalT20 Wc 2021.. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్స్‌లో కుమార ధర్మసేన ఒకడిగా వ్యవహరించనున్నాడు. దీంతో జాఫర్ కుమార్ ధర్మసేనను ట్రోల్ చేశాడు. చదవండి: T20 WC 2021 ENG Vs NZ Semi Final-1: కివీస్ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ''హే.. కుమార్.. ఈరోజు మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది. నువ్వు ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్నావంటే న్యూజిలాండ్ ఇక గెలవడం కష్టమే '' అంటూ 2019 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధర్మసేన అంపైరింగ్ చేసిన ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ధర్మసేన చేతితో సిక్స్ అని సైగలు చేయడం కనిపిస్తుంది. నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఫీల్డర్ తప్పిదంతో ఇంగ్లండ్‌కు ఓవర్ త్రోలో అదనంగా ఆరు పరుగులు(బౌండరీ) వచ్చి చేరాయి. ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ధర్మసేన ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా ఆరు పరుగులు ఇచ్చాడు. ఇక ఆరోజు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ టై కావడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్(26 బౌండరీలు) విశ్వవిజేతగా అవతరించింది. ఈ సందర్భంగానే జాఫర్ మరోసారి 2019 వన్డే ప్రపంచకప్‌ను గుర్తు చేస్తూ నేటి టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అంపైరింగ్‌గా వ్యవహరిస్తున్న కుమార ధర్మసేనను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! Hey Kumar, what time does the match start tonight? 🤭 #ENGvNZ #T20WorldCup pic.twitter.com/wH7N4v1LFx — Wasim Jaffer (@WasimJaffer14) November 10, 2021 -
‘ఫైనల్’ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్
లండన్: విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) థర్డ్ అంపైర్ కాగా, అలీమ్ దార్ (పాకిస్తాన్) నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బృందం గురువారం నాటి ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కూ పనిచేసింది. అయితే, ధర్మసేన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. యూకేలో ఫైనల్ ఉచిత ప్రసారం సొంతగడ్డపై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఆదివారం జరుగబోయే ప్రపంచ కప్ ఫైనల్‌ను ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుత కప్‌కు సంబంధించి యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 మెత్తబడి మెట్టుదిగింది. -
అంపైర్ అండతోనే వికెట్లు తీశా:అలీ
మాంచెస్టర్: కొంతమంది ఒకే ఒక్క ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోతారు. ఏనుగంత అవకాశం ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అవకాశాలకు అదృష్టం తోడైతే ఇంకేముంది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. ఇదే కోవలోకి వస్తాడు ఇంగ్లండ్ టెస్ట్ క్రికెటర్ మొయిన్ అలీ. వరుసగా రెండు టెస్టుల్లో ఇరగదీసి భారత్ ను కంగుతినిపించిన ఈ పార్ట్ టైమ్ స్పిన్నర్.. ఇంగ్లండ్ కు వరంలా మారాడు. కాగా తన ఈ విజయం వెనుక అంపైర్ కుమార ధర్మసేన పాత్ర ఉందని అలీ స్పష్టం చేశాడు. 'లార్డ్స్ టెస్టుల్లో ఎక్కువగా పరుగులిచ్చేశాను. ఆ సమయంలో బెల్ నాతో బౌలింగ్ లో వేగం పెంచమన్నాడు. అయితే నాకు వేగంగా బంతుల్ని ఎలా సంధించాలో తెలియలేదు. అనంతరం ఇదే విషయంపై కుమార్ ధర్మసేనను అడిగితే చిన్న చిట్కా చెప్పాడని' అలీ తెలిపాడు. ఆ చిట్కానే అనుసరించే మూడు, నాలుగు టెస్టుల్లో విజయం సాధించానన్నాడు. లార్డ్స్ టెస్టు అనంతరం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మాజీ ఆఫ్ స్పిన్నర్, అంపైర్ కుమార ధర్మసేనను సలహా తీసుకోవటమే తనకు ఉపకరించిందన్నాడు. బౌలింగ్ ను ఫ్లాట్ గా కాకుండా.. తిన్నగా వేగంగా బౌల్ చేయమన్న ఆ ఒక్క సలహాతోనే వికెట్లు తీశానని అలీ తెలిపాడు.