photo credit: IPL Twitter
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటైన విరాట్ కోహ్లి.. ఫీల్డర్‌గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ క్యాచ్ పట్టడం ద్వారా ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో మరో క్యాచ్ (యశస్వి జైస్వాల్) కూడా పట్టిన కోహ్లి.. 230 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు అందుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు అందుకోగా.. రెండో స్థానంలో ఉన్న కీరన్ పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు పట్టాడు. వీరిద్దరి తర్వాత కోహ్లి మూడో స్థానంలో, రోహిత్ శర్మ (98 క్యాచ్‌లు), శిఖర్ ధవన్ (93) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఇదే మ్యాచ్‌లో మరో ఆటగాడు కూడా కోహ్లిలాగే సెంచరీ చేశాడు. అది కూడా కోహ్లినే ఔట్ చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోహ్లి వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్.. 101 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా,. ఛేదనలో తడబడిన ఆర్‌ఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment