టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2021లో హార్ధిక్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా అతడి అంతర్జాతీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జట్టులో స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్ధిక్ స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలో మొదలైంది.
ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకేటేశ్ అయ్యర్ పేరును భారత మాజీ ఆటగాడు సబా కరీం తెరపైకి తీసుకొచ్చాడు. జట్టులో హార్ధిక్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అయ్యర్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. విజయ్ హాజారే ట్రోఫీలో వెంకేటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా రోహిత్ శర్మ, రాహుల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయాలని అతడు సూచించాడు.
"వైట్-బాల్ ఫార్మట్లో వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ బారత సీనియర్ జట్టు జట్టులోకి ఎంపిక అవుతారని నేను భావిస్తున్నాను. 2023 ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఇద్దరు ఆటగాళ్లు వీలైనంత త్వరగా జట్టులో భాగం కావాలి. రోహిత్ శర్మ, రాహుల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలి. మరోవైపు, విజయ్ హజారే ట్రోఫీలో 5 స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్థానంలో అయ్యర్ సరైన ఆటగాడు" అని కరీమ్ యూట్యాబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేశ్ అయ్యర్.. 112, 71, 151 పరుగులతో సత్తాచాటాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసి నాలుగు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 435 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: 6 Wickets In A Over: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment