Ex-Selector Comments On MS Dhoni: ‘‘ఎంఎస్ ధోని.. రంజీ ట్రోఫీ సెకండ్ సీజన్‌లో ఆడుతున్నపుడు తనను తొలిసారి కలిశాను. అప్పుడు అతడు బిహార్ జట్టుకు ఆడుతూ ఉండేవాడు. బ్యాటింగ్ చేయడంతో పాటు కీపర్‌గానూ వ్యవహరించేవాడు. స్పిన్నర్ అయినా పేసర్ అయినా దూకుడుగానే బ్యాటింగ్ చేసేవాడు.
కానీ.. వికెట్ కీపర్‌గా తన ఫుట్‌వర్క్ విషయంలో మెరుగుపడాల్సి ఉందనుకున్నాను. అదే విషయాన్ని అతడితో చర్చించాను. నాడు నేర్చుకున్న పాఠాలను నేటికీ ధోని పాటిస్తున్నాడు. ధోని కెరీర్‌లో అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం అన్నాడు. కెరీర్ తొలినాళ్లలో వికెట్ కీపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ ధోని.. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి కీపర్లలో ఒకడిగా ఎదిగాడని పేర్కొన్నాడు.
భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి జియో సినిమా షోలో పలు ఆసక్తికర విషయాలను మాజీ వికెట్ కీపర్ సబా కరీం పంచుకున్నాడు. ‘‘కెన్యాలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ, కెన్యా- ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ ధోని కెరీర్‌లో రెండో టర్నింగ్ పాయింట్. దినేశ్ కార్తిక్ జాతీయ జట్టుకు ఆడుతున్న క్రమంలో ధోనికి ఈ సిరీస్ ఆడే అవకాశం వచ్చింది.
అక్కడ తను వికెట్ కీపర్‌గా సేవలు అందించాడు. ఇక బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి మా నమ్మకాన్ని నిలబెట్టాడు’’ అని సబా కరీం.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు.
నేను గంగూలీకి చెప్పాను.. కానీ..
ఇక 2004లో ధోని పాకిస్తాన్ టూర్ మిస్సవడానికి గల కారణాన్ని కూడా సబా కరీం ఈ సందర్భంగా బయటపెట్టాడు. ‘‘కెన్యాలో అద్భుత ప్రదర్శన తర్వాత అతడి పేరు మారుమ్రోగిపోయింది. అప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను. నాడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఒక వికెట్ కీపర్ ఉన్నాడు.. అతడు అద్భుత నైపుణ్యాలు కలిగి ఉన్నాడని గంగూలీతో చెప్పాను. జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని కూడా అన్నాను. కానీ దురదృష్టవశాత్తూ.. ఎందుకో సౌరవ్ అప్పుడు అప్‌కమింగ్ ఆటగాడిపై నమ్మకం ఉంచలేకపోయాడు.
ధోనిని మేము అప్పుడు జాతీయ జట్టుకు సెలక్ట్ చేయలేదు. అయితే, ఆ తర్వాత వెంటనే టీమిండియాలోకి వచ్చాడు’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2004లో బంగ్లాదేశ్ టూర్‌కు ఎంపికైన ధోని.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచినా అనతికాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. ఇక మిగిలిందంతా చరిత్రే!!
చదవండి: వారణాసి అమ్మాయి.. వెస్టిండీస్ క్రికెటర్ భార్య! భోజ్‌పురీలో మాట్లాడగలదు.. ఇంకా!
Comments
Please login to add a commentAdd a comment