వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పడు వన్డే సిరీస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. మూడో వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బార్బోడస్ వేదికగా విండీస్‌తో రెండో వన్డేలో రోహిత్ సేన అమీతుమీ తెల్చుకోనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో చెలరేగిన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్‌పై భారత మాజీ ఆటగాడు సబా కరీం ప్రశంసల వర్షం కురిపించాడు.
కిషన్‌కు ఓపెనర్‌గానే కాకుండా మిడిలార్డర్‌లో రాణించే సత్తా ఉందని అతడు కొనియాడాడు. కాగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ.. కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన కిషన్ 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ నేపథ్యంలో కరీం జియో సినిమాతో మాట్లాడుతూ.. "కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని అస్సలు నేను ఊహించలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని కిషన్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ జట్టులో తన విలువను మరింత పెంచింది. ప్రస్తుతం పంత్ అందుబాటులో లేడు కాబట్టి రాహుల్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా పరిగిణలోకి తీసుకుంటారని నాకు తెలుసు.
అయితే రాహుల్ కూడా తన ఫిట్‌నెస్‌తో పోరాడతున్నాడు. కాబట్టి కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా పరిగణలోకి తీసుకోవాలి. అతడికి వికెట్ కీపింగ్‌తో పాటు ఓపెనింగ్, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. అతడికి జట్టులో రెగ్యూలర్‌గా అవకాశాలు ఇవ్వాలి. వరల్డ్‌కప్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా అతడిని ఎంపిక చేయాలని" చెప్పుకొచ్చాడు.
చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్
Comments
Please login to add a commentAdd a comment