టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే. గతేడాది జూలైలో భారత్ తరపున ధావన్ తన అఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. కాగా ధావన్ టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. ధావన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టులో ధావన్‌కు ఖచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం థీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శిఖర్ ప్రారంభిస్తాడని కరీం జోస్యం చెప్పాడు.
ఇండియా న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో శిఖర్ ధావన్‌కు స్థానం దాదాపు ఖారారైంది. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు విఫలమైన మ్యాచ్‌లు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, ధావన్‌ను ఓపెనర్లుగా ఉండాలని సెలక్టర్లు ఇప్పటికే నిర్ణయించారని నేను భావిస్తున్నాను" పేర్కొన్నాడు.
చదవండి: Ravindra Jadeja: తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment