
2023 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఇందులో ఒకటి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వరల్డ్‌కప్ సెంచరీల రికార్డు కాగా.. రెండోది వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ రికార్డు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో సచిన్ 6 శతకాలు బాదగా రోహిత్ కూడా సచిన్‌తో సమానంగా తన ఖాతాలో 6 సెంచరీలు కలిగి ఉన్నాడు.
ప్రపంచకప్ టోర్నీల్లో రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే 6 శతకాలు, 3 అర్ధశతకాలు చేశాడు. ఇందులో రోహిత్ ఒక్క 2019 ప్రపంచకప్‌లోనే 5 సెంచరీలు చేయడం విశేషం. త్వరలో ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో టీమిండియా 10కిపైగా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో రోహిత్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక వరల్డ్‌కప్ సెంచరీల రికార్డును సునాయాసంగా బద్దలు కొట్టే అవకాశం ఉంది.
మరో వైపు రోహిత్ రానున్న వరల్డ్‌కప్‌లో 2 ఇన్నింగ్స్‌ల్లో 22 పరుగులు చేస్తే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కును చేరిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 17 ఇన్నింగ్స్‌ల్లో 978 పరుగులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, 2023 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయవం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి.
ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment