
Courtesy: IPL
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్ తరుపున ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని
Saba Karim Comments On Virat Kohli: వచ్చే నెల ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో విజేతలు, జట్టు సమ తుల్యతలపైన మాజీలు, క్రికెట్ నిపుణులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ముందున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్ తరపున ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని కరీమ్ అభిప్రాయపడ్డాడు.
అతడు విరాట్ కోహ్లి గురించి మాట్లడూతూ.. "టీ20 విజయాల్లో టీమిండియా తరుపున కోహ్లి కీలక పాత్ర పోషించాడు. గతంలో అతడు టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్ చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరగుతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ప్రపంచ కప్‌లో కోహ్లి టీమిండియా తరుపున ఇన్పింగ్స్ ఆరంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి" అని కరీమ్ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్ రెండో దశలో ఆర్సీబీ రెండు వరుస ఓటముల తర్వాత ముంబైపై విజయం సాధించి గాడిలో పడింది. ఈ విజయంలో సారథి కోహ్లి 51 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. రెండు వరుస కోహ్లీ వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కోహ్లి.. పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియా టీ20 ఫార్మాట్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.
చదవండి: పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్
Virat Kohli: ఆ విషయం అర్థమైనట్లుంది.. అందుకే కెప్టెన్సీ వదులుకుని మరీ..