ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్‌లు కీలక పాత్ర పోషించారు. తొలుత విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో కార్తీక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆది నుంచే ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. సామ్ కుర్రాన్ వేసిన తొలి ఓవర్‌లోనే ఏకంగా 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత కూడా విరాట్ జోరు ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టీ20ల్లో 100 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా వరల్డ్‌క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో విరాట్ మూడో స్ధానంలోఉన్నాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(110) ఉండగా.. ఆ తర్వాతి స్ధానంలో డేవిడ్ వార్నర్ (109) ఉన్నాడు.
When Virat Kohli returns from break, you know he's lethal 🥵#RCBvsPBKS pic.twitter.com/H4zuHN9hxI
— OneCricket (@OneCricketApp) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment