BCCI Review: Reintroduces Yo-Yo Test, Check Details - Sakshi
Sakshi News home page

BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు?

Published Mon, Jan 2 2023 11:40 AM | Last Updated on Mon, Jan 2 2023 3:45 PM

BCCI Review: What Is Yo Yo Test In Cricket Top 5 Yo Yo Score Check - Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌- ‍కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

BCCI- ODI World Cup 2023- Yo-Yo Test: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సహా కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ చహర్‌ తదితర టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా రోహిత్‌ అందుబాటులో లేకపోవడం సహా పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో గతేడాది దాదాపు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు.

ఇక ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో పేస్‌ దళ నాయకుడు బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా సైతం గాయం కారణంగా ఐసీసీ ఈవెంట్‌కు దూరం కావడం ప్రభావం చూపింది. వెరసి కీలక ఈవెంట్లలో టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

వరుస వైఫల్యాల కారణంగా విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ చర్చనీయాంశమైంది. కాగా 2023లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో లోపాలు సవరించుకుని బరిలోకి దిగాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వ్యూహాలు రచిస్తోంది.

ఇందులో భాగంగా ప్లేయర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ యో- యో టెస్టును తిరిగి ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. దీంతో పాటు ఎముకల పరిపుష్టి(డెక్సా) పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ యో- యో టెస్టు అంటే ఏమిటి? ఈ టెస్టులో టాప్‌- 5 స్కోరర్లు ఎవరో తెలుసుకుందాం!

ఏమిటీ ‘యో–యో’ టెస్టు?!
రెండు కోన్‌ల (ప్లాస్టిక్‌ స్థంభాలు) మధ్య బీప్‌ సౌండ్‌తో పరిగెత్తించే పరీక్షే యో–యో టెస్టు. రెండు కోన్‌ల మధ్య 20 మీటర్ల దూరం ఉంటుంది. మూడు బీప్‌ సౌండ్‌లు మోగేలోపు ఈ దూరాన్ని పూర్తి చేయాలి. అంటే మొదటి బీప్‌నకు ఇక్కడి కోన్‌ నుంచి పరుగు ప్రారంభించి... రెండో బీప్‌ సౌండ్‌లోపు అవతలి కోన్‌కు చేరాలి.

మూడో బీప్‌ మోగే సరికి ఇవతలి కోన్‌ చేరాలి. దీనికి స్కోరు ఉంటుంది. అంటే నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తే మెరుగైన స్కోరు, ఆ తర్వాత సగటు స్కోరు ఇస్తారు. అసాధారణ ఫిట్‌నెస్‌తో ఉండే కోహ్లి యో–యో టెస్టు పాసైనప్పటికీ టాప్‌–5 స్కోరర్స్‌లో లేడు. అతను 19 స్కోరు చేసి 8వ స్థానంలో ఉన్నాడు. గతంలో షమీ, సంజూ సామ్సన్, రాయుడు, రైనా, పృథ్వీ షా, వాషింగ్టన్‌ సుందర్‌ యో–యో టెస్టులో ఫెయిలయ్యారు.

టాప్‌–5 యో–యో స్కోర్లు
1. షాన్‌ మసూద్‌ (పాక్‌) 22.1
2. బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌) 21.8
3. మయాంక్‌ డాగర్‌ (భారత్‌) 19.3
4. బెత్‌ లాంగస్టన్‌ (ఇంగ్లండ్‌)  19.2
5. రిజ్వాన్‌ (పాక్‌) 19.2 

చదవండి: WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్‌ సైన్యం
ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్‌ శర్మ భార్య ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement