
PC: Crictrakcer
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఘనమైన పునరాగమనం చేశాడు. తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమాను చాహర్ ఔట్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
చాహర్ ఓ సంచలన బంతితో టెంబా బావుమాను పెవిలియన్‌కు పంపాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన చాహర్.. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో బావుమాను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బావుమా కూడా ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా ఆక్టోబర్2న జరగనుంది.
Wat a delivery #INDvSA Take a bow @deepak_chahar9 👏🔥 pic.twitter.com/x6h5wTWJXR
— Trending Killer (@Trending_007) September 28, 2022
చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా