Deepak Chahar Gets 1st Wicket In IPL After 568 Days Gap Vs MI Match - Sakshi
Sakshi News home page

#DeepakChahar: '568 రోజులు తర్వాత ఎట్టకేలకు వికెట్‌'

Published Sat, May 6 2023 6:08 PM | Last Updated on Sat, May 6 2023 7:33 PM

Deepak Chahar Gets 1st-Wicket In IPL After 568 Days Gap Vs MI Match - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ ఎట్టకేలకు తొలి వికెట్‌ సాధించాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను ఔట్‌ చేయడం ద్వారా వికెట్‌ సాధించాడు. దాదాపు 568 రోజుల తర్వాత దీపక్‌ చహర్‌ ఐపీఎల్‌లో వికెట్‌ తీయడం విశేషం.

చివరిగా ఐపీఎల్‌ 2021 ఫైనల్లో వికెట్‌ తీసిన చహర్‌ ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఈ సీజన్‌లోనూ సీఎస్‌కే ఆడిన ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకోవడంతో దీపక్‌ చహర్‌పై విమర్శలు వచ్చాయి.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన దీపక్‌ చహర్‌ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే చహర్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ రెండో బంతికి తొలుత ఇషాన్‌ కిషన్‌ను ఔట్‌ చేసిన చహర్‌.. ఆ తర్వాత నాలుగో బంతికి ధోని సూచనలు పాటిస్తూ రోహిత్‌ను బుట్టలో వేసుకొని రెండో వికెట్‌ సంపాదించాడు.

ఇక సీఎస్‌కే దీపక్‌ చహర్‌ను రూ.14 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో చహర్‌ వికెట్‌ సాధించగానే.. ''568 రోజులు.. 28 కోట్లు.. ఒక్క వికెట్‌'' అంటూ ఒక అభిమాని ట్వీట్‌ చేయడం ఆసక్తి కలిగించింది.

చదవండి: రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement