India's Tour of South Africa: Fans Says Select Deepak Chahar 1st Test and Troubles Pujara and Rahane - Sakshi
Sakshi News home page

IND vs SA: 'మనోళ్లనే ముప్పతిప్పలు పెట్టాడు.. ఆ బౌలర్‌కు అవకాశమిస్తే'

Published Thu, Dec 23 2021 6:38 PM | Last Updated on Fri, Dec 24 2021 7:43 AM

Fans Says Select Deepak Chahar 1st Test Vs SA Troubles Pujara And Rahane - Sakshi

సౌతాఫ్రికా టూర్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న దీపర్‌ చహర్‌ టీమిండియా క్రికెటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారాలను ముప్పతిప్పలు పెట్టాడు. డిసెంబర్‌ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. పుజారా, రహానే, ప్రియాంక్‌ పాంచల్‌, వృద్ధిమాన్‌ సాహాలకు దీపక్‌ చహర్‌ నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. అయితే దీపక్‌ చహర్‌ కచ్చితమైన బౌన్స్‌, స్వింగ్‌, పేస్‌ పదునుకు బ్యాటింగ్‌ చేయలేక పూర్తిగా చేతులెత్తేశారు.

చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్‌ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్‌ కొట్టదు

అతని బౌలింగ్‌ దాటికి నలుగురు ఒక్కోసారి క్లీన్‌బౌల్డ్‌ లేదా ఎల్బీ రూపంలో వెనుదిరగడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. '' దక్షిణాఫ్రికా పిచ్‌లు దీపక్‌ చహర్‌కు కరెక్ట్‌గా సరిపోతాయి. ..టెస్టు సిరీస్‌కు అతన్ని పరిగణలోకి తీసుకోండి''..'' మన బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టిన చహర్‌ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించగలడు''.. అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. 

ఇప్పటికే టీమిండియా తరపున టి20ల్లో ఆడిన దీపక్‌ చహర్‌ తన సత్తా ఏంటో చూపించాడు. ఇక కచ్చితమైన పేస్‌తో వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేయడం చహర్‌ స్పెషాలిటీ. ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ దీపక్‌ చహర్‌ సీఎస్‌కే తరపున 15 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.  

చదవండి: David Warner: 27 రోజుల తర్వాత ట్వీట్‌ చూసి షాక్‌.. వార్నర్‌ క్షమాపణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement