సాతాఫ్రికాతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు అప్పగించింది. కాగా ప్రొటీస్‌కు సిరీస్ కోల్పోవడంపై విరాట్ కోహ్లి మ్యాచ్ అనంతరం స్పందించాడు.
‘పేలవ బ్యాటింగ్‌తోనే కుప్పకూలిపోయాం. మరో కారణం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించను. ప్రత్యర్థి బౌలర్లు మాపై ఒత్తిడిని పెంచడంలో సఫలమయ్యారు. ఫలితం సహజంగానే తీవ్ర నిరాశ కలిగించింది. మేం దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే ఓడించగలమని అందరూ నమ్మారు. కానీ అది సాధ్యం కాలేదనేది వాస్తవం. కీలక సమయాల్లో మేం ఏకాగ్రత కోల్పోగా, అదే సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగారు.
విదేశాల్లో జోరు మీదున్నప్పుడు దానిని కొనసాగించడం కూడా ముఖ్యం. మేం అందులో విఫలమయ్యాం. (డీఆర్‌ఎస్ వివాదంపై స్పందిస్తూ) మైదానంలో పరిస్థితి ఏమిటనేది బయటివారికి తెలీదు. దానిని సమర్థించుకునే ప్రయత్నం చేయను కానీ ఆ సమయంలో మూడు వికెట్లు తీసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆ ఘటన వల్ల ఓడామని కూడా చెప్పను. వాస్తవం ఏమిటంటే మేం ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాం’ అని కోహ్లి పేర్కొన్నాడు.
The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦
— Cricket South Africa (@OfficialCSA) January 14, 2022
Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj
Comments
Please login to add a commentAdd a comment