Marco Jansen Virat Kohli Photo Viral On Social Media, Deets Inside In Telugu - Sakshi
Sakshi News home page

Marco Jansen Vs Kohli: ఒకప్పుడు నెట్‌బౌలర్‌గా కోహ్లి​కి చుక్కలు.. కట్‌చేస్తే

Published Wed, Dec 29 2021 8:50 PM | Last Updated on Thu, Dec 30 2021 9:29 AM

Marco Jansen Bowling-out Kohli Net Session 2018 Picking Wicket 1st Test - Sakshi

టీమిండియాతో తొలి టెస్టు ద్వారా దక్షిణాఫ్రికా తరపున మార్కో జాన్సెన్‌ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 20 ఏళ్ల వయసు ఉన్న జాన్సెన్‌ ఆడుతున్న తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. మనకు ప్రత్యర్థి ఆటగాడే అయినప్పటికి తన బౌలింగ్‌తో ఇవాళ అందరిని మాట్లాడుకునేలా చేశాడు. బాక్సింగ్‌ డే టెస్టు తో టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ప్రొటీస్‌ బౌలర్‌ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇందులో కోహ్లి వికెట్‌ కూడా ఉండడం విశేషం. గుడ్‌లెంగ్త్‌ డెలివరితో కోహ్లిని బోల్తా కొట్టించి వికెట్‌ తీసుకున్నాడు. మార్కో గురించి మాట్లాడుతూ కోహ్లి ప్రస్తావన తేవడం వెనుక ఒక కారణం ఉంది. 

చదవండి: Virat Kohli: రెండు ఇన్నింగ్స్‌లో ఒకేలా ఔటైన కోహ్లి.. ఫ్యాన్స్‌ ట్రోల్‌

2018లో టీమిండియా సాతాఫ్రికా పర్యటనకు వచ్చింది. అప్పటికి మార్కో జాన్సన్‌ ప్రొటీస్‌కు నెట్‌బౌలర్‌గా వ్యవహరిస్తున్నాడు. మార్కో జాన్సన్‌కు కోహ్లి అంటే చాలా ఇష్టం. టీమిండియా ప్రాక్టీస్‌ సమయంలో జాన్సన్‌ అక్కడే ఉన్నాడు. జాన్సెన్‌ తన కవల సోదరుడు డ్యుయన్‌ జాన్సెన్‌తో  వెళ్లి కోహ్లిని కలిశాడు. ఆ తర్వాత నెట్‌బౌలర్‌గా కోహ్లికి కొన్ని బంతులు వేశాడు. అందులో కోహ్లి కొన్ని మంచి షాట్లు ఆడితే.. జాన్సన్‌ వేసిన కొన్ని బంతులకు కోహ్లి వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో కోహ్లి జాన్సెన్‌ను 'గుడ్‌బాల్స్‌' వేశావంటూ మెచ్చుకున్నాడు. ఆ సమయంలో మార్కో జాన్సెన్‌.. కోహ్లితో కలిసి సెల్ఫీ దిగాడు.ఈ ఫోటోను జాన్సన్‌ ఇప్పటివరకు దాచుకోవడం విశేషం. 

చదవండి: దక్షిణాఫ్రికాకు షాక్‌.. నిర్ణయం మార్చుకున్న కీలక ఆటగాడు.. సిరీస్‌కు దూరం!

కట్‌చేస్తే.. సరిగ్గా మూడేళ్ల తర్వాత తాజాగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ తన ఫెవరెట్‌ క్రికెటర్‌ కోహ్లి వికెట్‌ను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మార్కో జాన్సన్‌ కోహ్లితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ఇది చూసిన కొంతమంది అభిమానులు.. ''కోహ్లికి అప్పుడు నెట్‌బౌలర్‌గా చుక్కలు చూపించాడు.. ఇప్పుడు ఏకంగా వికెట్‌ తీశాడు'' అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement