
సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్‌లో మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకు ఔటైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసి మార్కో జాన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి దాదాపు ఒకేరీతిలో ఔటయ్యాడు.. యాంగిల్ మాత్రమే మారింది. కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో కనిపించిన నిర్లక్ష్యం.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కనబడింది. మార్కో జాన్సన్ ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని అనవసరంగా గెలుక్కొని మరోసారి మూల్యం చెల్లించకున్నాడు. కోహ్లి షాట్‌లో ఎంత నిర్లక్ష్యం అంటే.. అసలు ఏదో కొట్టాలని కొట్టాడు.. అది సింపుల్‌గా వెళ్లి కీపర్ డికాక్ చేతిలో పడింది.
దీంతో ఫ్యాన్స్ కోహ్లి ఔటైన తీరుపై మరోసారి ట్రోల్ చేశారు. ''ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఎందుకు గెలుక్కుంటాడో అర్థం కాదు.. కోహ్లి టెస్ట్ కెరీర్ మసకబారుతుంది.. పరిమిత ఓవర్లలో ముగిసింది.. ఇక టెస్టు క్రికెట్‌లో మిగిలింది.. ఎండ్ ఆఫ్ ది ఎరా.. కోహ్లి ఇలా ఔటవ్వడం సిగ్గుచేటు.. అంటూ కామెంట్స్ చేశారు.
Virat Kohli's dismissal in both the innings. pic.twitter.com/kZmY4if6qi
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2021
Comments
Please login to add a commentAdd a comment