
Fans Troll Virat Kohli Giving Wicket After Good Start.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు కలిసి తొలి వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే మయాంక్ ఔటైన వెంటనే పుజారా గోల్డెన్ డక్ కావడంతో కథ అడ్డం తిరిగిందనుకున్నాం. అయితే క్రీజులోకి వచ్చిన కోహ్లి కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆడాడు. ఒకపక్క కేఎల్ రాహుల్ ప్రొటీస్ బౌలర్లకు చాన్స్ ఇవ్వకుండా ఆడుతుండగా.. కోహ్లి కూడా అతనికి సహకరిస్తున్నాడు. సెట్ అయిందిలే అని మనం అనుకునేలోపే కోహ్లి షాక్ ఇచ్చాడు. 35 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన కోహ్లి ఎన్గిడి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి మరోసారి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని అవవసరంగా గెలికి మీరి వికెట్ ఇచ్చుకొని మూల్యం చెల్లించకున్నాడు.
చదవండి: Cheteshwar Pujara:'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్
మంచి ఆరంభం లభించిన తర్వాత ఇలా వికెట్ పారేసుకోవడం ఏంటంటూ అభిమానులు ట్రోల్ చేశారు. సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు కావొస్తుందని.. ఇక మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది కూడా ముగుస్తుందని.. కనీసం రెండో ఇన్నింగ్స్‌లో అవకాశం వస్తే సెంచరీ కొట్టాలని కోహ్లి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక తొలిరోజు ఆటలో అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఆడుతున్నారు. రెండోరోజు ఆటలో రెండు సెషన్ల పాటు నిలదొక్కుకొని టీమిండియా బ్యాటింగ్ చేస్తే మాత్రం దక్షిణాఫ్రికా జట్టుకు కష్టాలు మొదలైనట్లే.
చదవండి: IND Vs SA: 21 టెస్టుల్లో మూడోసారి మాత్రమే.. టీమిండియా ఓపెనర్ల కొత్త చరిత్ర