క్రికెట్‌లో ఏ జట్టైనా సరే.. సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు కెప్టెన్ కోచ్‌తో కలిసి మీడియా సమావేశానికి రావడం ఆనవాయితీ. అయితే దానిని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రేక్ చేయనున్నట్లు సమాచారం. మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది.
చదవండి: IND vs SA: 'ఐదో స్థానం మాకు కీలకం.. పెద్ద తలనొప్పిగా మారింది'
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ఒకరోజు ముందు (డిసెంబర్ 25)న మీడియా సమావేశానికి కోహ్లి హాజరుకావాలి. కానీ కోహ్లి ఈ సమావేశానికి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక మెయిల్ జారీ చేసింది. సెంచూరియన్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే పాల్గొంటాడని మొయిల్‌లో పేర్కొంది.
అయితే వన్డే కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లి దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరే ఒకరోజు ముందు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టి20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో తనను ఆపినట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన ప్రకటనను కోహ్లీ ఖండించాడు. కోహ్లీ వ్యాఖ్యలపై గంగూలీ ఏం చెప్పకుండా అంతా బీసీసీఐ చూసుకుంటుందని పేర్కొన్నాడు. తాజాగా కోహ్లి బీసీసీఐ ఆదేశాలతోనే మీడియా సమావేశానికి దూరంగా ఉండనున్నాడా లేక తనంతట తానుగానే ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: James Anderson: 'మా బౌలింగ్‌ను విమర్శించే హక్కు మీకు లేదు'
Comments
Please login to add a commentAdd a comment