జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక టీమిండియా ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలంటే ఆఖరి టెస్టును కచ్చితంగా గెలవాల్సిందే.
ఇక టీమిండియా ఓడినప్పటికి శార్దూల్ ఠాకూర్ మాత్రం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియా ఓడిన టెస్టులో బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన ఆటగాడిగా శార్దూల్ నిలిచాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడు వికెట్లు తొలి ఇన్నింగ్స్‌లోనే రావడం విశేషం. ఇక టీమిండియా ఓడిన టెస్టులో బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన మూడో టీమిండియా పేసర్‌గా శార్దూల్ నిలిచాడు. ఇంతకముందు జగవల్ శ్రీనాథ్( కోల్‌కతా వేదికగా 1998-99లో పాకిస్తాన్‌పై 8/86), కపిల్ దేవ్( అహ్మదాబాద్ వేదికగా 1983-84లో వెస్టిండీస్‌పై 9/83) ఈ ఫీట్‌ను నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment