South Africa Vs India 2nd Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సన్నద్ధం అవుతోంది. లోపాలు సవరించుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు వీలుగా నెట్స్‌లో చెమటోడుస్తోంది. ముఖ్యంగా సెంచూరియన్ టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ మరింత కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
హిట్‌మ్యాన్ కఠిన ప్రాక్టీస్
నెట్స్‌లో వైవిధ్యమైన బంతులు ఎదుర్కొంటూ కేప్‌టౌన్ టెస్టుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ సందర్భంగా భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడినట్లు సమాచారం. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది.
The Indian skipper @ImRo45 at Centurion nets. #INDvSA
— Kushan Sarkar (@kushansarkar) December 30, 2023
Video Courtesy: @kushansarkar pic.twitter.com/p0pvmbkyEX
షార్ట్ బాల్‌ను ఆడటంలో విఫలమైన శార్దూల్.. బంతి ఎడమ భుజానికి తాకడంతో నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి ఐస్‌ప్యాక్ పెట్టాడు. అయితే, నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించకపోవడంతో అతడు మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్‌కు కూడా అందుబాటులో ఉండలేకపోయాడు.
పూర్తిగా విఫలమైన శార్దూల్.. యువ పేసర్ ఎంట్రీ!
ఒకవేళ నొప్పి తీవ్రతరమైతే అతడిని స్కానింగ్ పంపాలని వైద్య సిబ్బంది భావిస్తోంది. కాగా ఒకవేళ గాయం కారణంగా శార్దూల్ ఠాకూర్ రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
అలా గాకుండా శార్దూల్ అందుబాటులో ఉన్నా కూడా మేనేజ్‌మెంట్ అతడిపై వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో ఆల్‌రౌండర్‌గా అతడి ప్రదర్శన దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే మ్యాచ్‌లో శార్దూల్ 19 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 100 పరుగులు ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు.
ఇక బ్యాటర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో పర్వాలేదనిపించిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- టీమిండియా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: Future Legend: గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు! రచిన్ సైతం...
STORY | Shardul Thakur gets hit on shoulder at nets in South Africa
— Press Trust of India (@PTI_News) December 30, 2023
READ: https://t.co/CCreEtNC8Q
VIDEO: #INDvsSA pic.twitter.com/4357zyDm3J
Comments
Please login to add a commentAdd a comment