
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తుంది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రొటీస్‌ను దెబ్బ తీస్తున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 132 పరుగులతో ఆడుతోంది. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా మరో 198 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు రెండు రోజులు సమయం ఉండడంతో వర్షం అంతరాయం కలిగించకపోతే మాత్రం టీమిండియాకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
ఇక మ్యాచ్‌లో తొలి నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత డికాక్, బవుమాతో కలిసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించాడు. అయితే 34 పరుగులతో నిలదొక్కుకున్నట్లు కనిపించిన డికాక్‌ను శార్దూల్ ఠాకూర్ సూపర్ డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. శార్దూల్ వేసిన గుడ్‌లెంగ్త్ డెలివరీ ఆఫ్‌స్టంప్ అవతల పడగా.. డికాక్ థర్డ్‌మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. దీంతో ఔటయ్యానన్న కోపంతో డికాక్ తన బ్యాట్‌తో వికెట్లను కొట్టాలనుకొని చివరి నిమిషంలో ఆగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.
— Addicric (@addicric) December 28, 2021
Comments
Please login to add a commentAdd a comment