భారత జట్టులో నో ఛాన్స్‌.. కట్‌ చేస్తే! అక్కడ మాత్రం 6 వికెట్లతో | Vijay Hazare Trophy 2023: Deepak Chahar picks 6 wicket haul agianst Gujart | Sakshi
Sakshi News home page

VHT 2023: భారత జట్టులో నో ఛాన్స్‌.. కట్‌ చేస్తే! అక్కడ మాత్రం 6 వికెట్లతో

Published Sat, Nov 25 2023 4:33 PM | Last Updated on Sat, Nov 25 2023 4:49 PM

Vijay Hazare Trophy 2023: Deepak Chahar picks 6 wicket haul agianst Gujart - Sakshi

దీపక్‌ చాహర్‌(ఫైల్‌ ఫోటో)

విజయ్ హజారే ట్రోఫీ 2023 టీమిండియా యువ పేసర్‌,  రాజస్తాన​ ఫాస్ట్‌ బౌలర్‌ దీపక్ చాహర్  దుమ్మురేపుతున్నాడు. ఈ ‍టోర్నీలో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో దీపక్‌ చాహర్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహర్‌ తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

తన 10 ఓవర్ల కోటాలో 41 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్‌ దాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 29 ఓవర్లలో కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్‌ బ్యాటర్లలో చిరాగ్‌ గాంధీ(43) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

రాజస్తాన్‌ బౌలర్లలో చాహర్‌తో పాటు ఖాలీల్‌ అహ్మద్‌ రెండు, అంకిత్‌ చౌదరీ, ధావన్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్‌ ఛేదించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ దీపక్‌ హుడా(76 నాటౌట్‌) పరుగులతో  మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.

దీపక్‌ చాహర్‌ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మిండియా తరపున చివరగా గతేడాది ఆక్టోబర్‌లో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇప్పటివరకు భారత్‌ తరపున 37 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చాహర్‌.. 45 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. ఇకపై యూపీకి ఆడొద్దు: గతాన్ని తలచుకున్న షమీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement