దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో చాహర్ స్థానంలో మిగిలిన రెండు వన్డేలకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. కాగా సుందర్ కూడా గాయం కారణంగా గత కొంత కాలం నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఇప్పటి వరకు సుందర్ కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. అతడు చివరసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ తరపున ఆడాడు. కాగా ప్రోటీస్‌తో తొలి వన్డేకు ముందు గాయపడిన చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు.
ఇక అఖరి రెండు వన్డేలకు సుందర్ భారత జట్టుతో కలవనున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఓటమి చెందిన టీమిండియా.. రాంఛీ వేదికగా రెండో వన్డేలో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో బిష్నోయ్ స్థానంలో సుందర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ
Comments
Please login to add a commentAdd a comment