Trolls On Deepak Chahar Sister Over Honeymoon Advice, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Deepak Chahar: ఓ తమ్ముడికి ఇచ్చే సలహా ఇదేనా? మరీ ఇంత నీచంగా! నెటిజన్ల ఫైర్‌!

Published Sat, Jun 4 2022 1:06 PM | Last Updated on Sat, Jun 4 2022 3:21 PM

Deepak Chahar Sister Trolled Cheap Behaviour Over Honeymoon Advice - Sakshi

దీపక్‌ చహర్‌, జయా భరద్వాజ్‌, మాలతి చహర్‌(PC: Malti Chahar)

Tolls On Deepak Chahar Sister Malti Over Honeymoon Advice: టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ చహర్‌ సోదరి మాలతి చహర్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఒక అక్కగా ఏం మాట్లాడాలో తెలియదా? పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మీ మీద బాగా పడినట్లుంది? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడూ మరీ ఇంత పబ్లిక్‌గా ఇలాంటి కామెంట్లు చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు. తమ్ముడు దీపక్‌, అతడి భార్యను ఉద్దేశించి మాలతి చేసిన ట్వీట్‌ ఇందుకు కారణమైంది.

శుభాకాంక్షల వెల్లువ
అసలు విషయం ఏమిటంటే
.. భారత పేసర్‌ దీపక్‌ చహర్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్‌ 2న ఆగ్రాలో వివాహమాడాడు. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపక్‌ సోదరి మాలతి సైతం తమ్ముడు, మరదల్ని విష్‌ చేశారు.

ఈమె మా ఇంటిపిల్ల..
నవ దంపతులతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. ‘‘ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు’’ అని పేర్కొన్నారు. అసలే ప్రపంచకప్‌ టోర్నీ సమీపిస్తోందని.. హనీమూన్‌ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు మాలతిని విమర్శిస్తున్నారు.

మరీ ఇంత ఓవరాక్షన్‌ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు. అయినా, దీపక్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్‌ అయిపోయారా? అతడి సేవలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు.. భువీ ఉన్నాడు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో 14 కోట్లకు సీఎస్‌కే దీపక్‌ చహర్‌ను కొనుగోలు చేయగా గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికకాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement