Malathi
-
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్‌లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!
రాత్రిపూట కనిపించే నక్షత్రాలు ఉదయాన్నే మాయమైనట్లు గ్లామర్ ప్రపంచంలో రఫ్ఫాడించిన ఎంతోమంది సినీతారలు అవకాశాలు సన్నగిల్లాక కనిపించకుండా పోయారు. అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో నెట్టుకొచ్చినవారు కొందరైతే, ఖాళీ చేతులతో, ఆర్థిక కష్టాలతో, గుండెనిండా శోకంతో అర్ధాంతరంగా కన్నుమూసిన ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకరే కె.మాలతి. స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఆమె తర్వాతికాలంలో ఎటువంటి దుర్భర జీవితం గడిపింది? ఎన్ని కష్టాలు అనుభవించింది? అనేది నేటి కథనంలో చదివేద్దాం.. చిన్న వయసులోనే పెళ్లి కె. మాలతి. ఈమె తెలుగింటి అమ్మాయి. 1926లో ఏలూరులో జన్మించింది. తండ్రి గొల్లపూడి సూర్య నారాయణ. ఆమె ఐదవ ఏటనే ఆయన చనిపోయారు. అయినా మాలతి బడికి పోయింది. సంగీతం నేర్చుకుంది. నాటకాల్లో పాల్గొంది. చిన్నతనంలోనే మాలతి పెళ్లి జరిగింది. భర్త వీరాచారి ప్రోత్సాహంతో సినిమాల్లో అడుగుపెట్టింది. ఉష సినిమాలో పార్వతీదేవిగా నటించింది. ఈ సినిమా సక్సెస్ అవలేదు కానీ, మాలతి కెరీర్‌కు మాత్రం దీనితోనే బలమైన పునాది పడింది. తన రెండో సినిమా సుమంగళి. ఇందులో ఆమె పాడిన వస్తాడే మా బావ.. పాట ఏళ్లతరబడి ప్రేక్షకుల పెదవులపై నాట్యం చేసింది. పాతాళ భైరవితో క్రేజ్.. కానీ కొరవడిన ఆఫర్లు మామా మచ్ఛీంద్ర, గుణ సుందరి, రత్నకుమారి.. ఇలా అనేక సినిమాలు చేసుకుంటూ పోయింది. నందమూరి తారకరామారావుతో కలిసి చేసిన పాతాళ భైరవి(1951) అఖండ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు కలిసి రాలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు మూడేళ్లపాటు మరే సినిమా చేయలేదు. కాళహస్తి మహత్యంతో రీఎంట్రీ ఇచ్చింది, కానీ ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్టీఆర్‌తో జోడీ కట్టిన మాలతి తర్వాత ఆయనకు సోదరిగానూ నటించినట్లు తెలుస్తోంది. తను చివరగా 1979లో వచ్చిన 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం'లో నటించింది. ఇదీ చదవండి: నటుడి భార్య మృతి.. నూరేళ్లు చేయి వదలనంటూ ఎమోషనలైన వీడియో వైరల్ ప్రసాదమే భోజనం భర్త మరణించాక మాలతి మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. అప్పట్లో కాచిగూడలో ప్రభాస్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ వెనక రేకుల షెడ్డులో మాలతి ఒంటరిగా ఉండేది. రోజూ పక్కనే ఉన్న గుడికి వెళ్లి రెండుపూటలా పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది. తను నటిని అన్న విషయం ఎవరికీ చెప్పేది కాదు. 1979 నవంబర్ 25న పెనుగాలి వీచడంతో ప్రభాస్ థియేటర్‌కు చెందిన 20 అడుగుల గోడ కూలి మాలతి ఇంటి పైకప్పుపై పడింది. రేకుల షెడ్డు నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న మాలతిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె కన్నుమూసింది. ఇంట్లో ఉన్న ట్రంకుపెట్టె తెరచి చూస్తే ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి. అప్పుడు అందరికీ తను పాతాళ భైరవి హీరోయిన్ అని తెలిసింది. అలాగే ఆమె కష్టాలను, బాధలను రాసుకున్న డైరీ కనిపించగా దాన్ని చదివి కంటతడి పెట్టనివారు లేరు! చదవండి: సోది సినిమా, అచ్చంగా సీరియల్.. ఏకంగా రూ.200 కోట్లు -
వాహనం పంపిస్తామన్నా వారే వెళ్లారు..
ఏన్కూరు: ‘రోడ్లు బాగాలేవు... వాహనాలెలా వస్తాయి... ఉదయం ఆరు గంటలకు చిన్నారి మృతదేహాన్ని తీసుకువేళ్లేందుకు పార్థివ వాహనం ఏర్పాటు చేస్తామని ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ చెప్పినా వారే బండి మీద తీసుకెళ్లారు.... గ్రామస్తులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించడం లేదు’ అని ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి వ్యాఖ్యానించారు. ‘బైక్‌పై కూతురు మృతదేహంతో 55 కి.మీ’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన కథనానికి స్పందించిన డీఎంహెచ్ఓ మాలతి ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతురాలు సుక్కు తల్లి ఆదితో మాట్లాడారు. పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు గ్రామంలో గర్భిణులతో మాట్లాడి చికిత్స, కాన్పు తేదీల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. కొత్తమేడేపల్లి ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి 10కి.మీ దూరంలో ఉండగా, రోడ్డు అధ్వానంగా ఉన్న కారణంగా అధికారులు గ్రామానికి రావడం లేదన్నారు. వాహనాలు కూడా రాలేని పరిస్థితి ఉండడంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందదని చెప్పారు. గ్రామంలో ఫిట్స్, నిమ్ము వచ్చి చిన్నారులు మృతి చెందుతున్నారని ఆమె వెల్లడించారు. గ్రామంలో సబ్‌సెంటర్ ఏర్పాటు చేయొచ్చు కదా అని ‘సాక్షి’ ప్రశ్నించగా చిన్నారులకు బాగా జ్వరం వచ్చినపుడు ఫిట్స్ వస్తాయే తప్ప అదేమీ వ్యాధి కాదని తెలిపారు. అయినప్పటికీ ప్రతీ వారం గ్రామానికి ఏఎన్ఎం వస్తున్నందున, సబ్‌సెంటర్ ఏర్పాటుపై పరిశీలిస్తామని తెలిపారు. కాగా, కోవిడ్ సమయాన కొత్తమేడేపల్లిలో ఒక కేసు కూడా నమోదు కాలేదని డీఎంహెచ్ఓ గుర్తు చేశారు. డీఎంహెచ్ఓ మాలతి వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, ఎంపీపీ అరెం వరలక్ష్మి, ప్రభుత్వ వైద్యాధికారి పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
Deepak Chahar: ఓ తమ్ముడికి ఇచ్చే సలహా ఇదేనా? మరీ ఇంత నీచంగా!
Tolls On Deepak Chahar Sister Malti Over Honeymoon Advice: టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ సోదరి మాలతి చహర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక అక్కగా ఏం మాట్లాడాలో తెలియదా? పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మీ మీద బాగా పడినట్లుంది? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడూ మరీ ఇంత పబ్లిక్‌గా ఇలాంటి కామెంట్లు చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు. తమ్ముడు దీపక్, అతడి భార్యను ఉద్దేశించి మాలతి చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. శుభాకాంక్షల వెల్లువ అసలు విషయం ఏమిటంటే.. భారత పేసర్ దీపక్ చహర్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్ 2న ఆగ్రాలో వివాహమాడాడు. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపక్ సోదరి మాలతి సైతం తమ్ముడు, మరదల్ని విష్ చేశారు. ఈమె మా ఇంటిపిల్ల.. నవ దంపతులతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. ‘‘ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు’’ అని పేర్కొన్నారు. అసలే ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తోందని.. హనీమూన్ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాలతిని విమర్శిస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు. అయినా, దీపక్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్ అయిపోయారా? అతడి సేవలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు.. భువీ ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు సీఎస్కే దీపక్ చహర్‌ను కొనుగోలు చేయగా గాయం కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికకాలేదు. Ab ladki hui humari….Wish you guys a very happy married life🧿 @deepak_chahar9 please take care of your back during your honeymoon..we have World Cup ahead 😜#family #brother #marriage #siblings pic.twitter.com/Hm2unculO7 — Malti Chahar🇮🇳 (@ChaharMalti) June 3, 2022 Deepak Chahar and Rahul Chahar were seen dancing during Haldi Ceremony#deepakchahar #haldiceremony #deepakchaharwedding pic.twitter.com/5Jl2KhbdfA — Shriyansh Bhardwaj (@Shriyansh836821) June 1, 2022 View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
60 కుటుంబాలు.. ఒక జలదేవత
గొడ్డలి నీటిలో పారవేసుకుంటే జలదేవత ప్రత్యక్షమవడం మనకు తెలుసు. కాని ఇక్కడ నీళ్లు లేవు. పారవేసుకోవడానికి పెన్నిధీ లేదు. ఆకలి బతుకుల గిరిజన జీవితం తప్ప. ఒరిస్సా అడవిలో అరవై కుటుంబాలు. ఎవరికి పడతాయి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోతున్నాయి. అప్పుడు మాలతి సిసా వచ్చింది. ఏకంగా నీరు తగిలేంత లోతు బావి తవ్వింది. ‘వాటర్ గర్ల్’ అని మీడియా అంటోంది. జలదేవతే సరైన పదం. ఇది అచ్చు సినిమాల్లో జరిగినట్టే జరిగింది. 25 ఏళ్ల మాలతి భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ చేసి మల్కన్‌గిరి జిల్లాలోని తన గ్రామం బోండాఘాటీకి చేరుకుంది రెండు నెలల క్రితం. బోండాఘాటి అడవి ప్రాంతం. అక్కడ బోండులు అనే గిరిజన తెగ జీవిస్తూ ఉందని 1950 వరకూ భారత ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించాక కూడా వారి కోసం జరిగింది తక్కువ. ఇంకా చెప్పాలంటే మాలతి ఆ ఊరి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అమ్మాయి. అంటే ఇన్నేళ్లు అక్కడ వారి అభివృద్ధికి ఏ మేరకు పని జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరే, అభివృద్ధి పెద్దమాట. తాగడానికి నీళ్లు ప్రాణాధారం కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టే ఇప్పుడూ తన కుటుంబం నీళ్ల కోసం అవస్థ పడటం మాలతి గమనించింది. ఊళ్లో ఉండే బోరింగులు పాడయ్యాయి. కుళాయిలు పని చేయవు. నీళ్లు కావాలంటే తల్లి, తన ముగ్గురు చెల్లెళ్లు కిలోమీటరు మేర బిందెలు తల మీద పెట్టుకుని బయలుదేరాల్సిందే. ఇంతకు ముందు ఇదంతా మామూలు మాలతికి. కాని ఇప్పుడు తను చదువుకుంది. తనకు జరుగుతున్న అన్యాయం ఏమిటో... తమ వారి పరిస్థితులు ఏమిటో... బయట లోకం ఎలా ఉందో చూసింది. ఈ కష్టాలు మనమే తీర్చుకోవచ్చు అని తల్లిదండ్రులకు చెప్పింది. ‘మనమే బావి తవ్వుదాం’ అంది. ఇలా ఊళ్లో ఎవరూ ముందుకు వచ్చిన దాఖలా లేదు. మాలతి తండ్రి ధబులు, తల్లి సమరి కూతురికి సపోర్ట్ చేయాలనుకున్నారు. మాలతి ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత... ‘అక్కా... మేము నీకు సాయం పడతాం’ అన్నారు. ‘ఈ బావి మన కోసం మాత్రమే కాదు... ఊళ్లో ఉన్న 60 కుటుంబాల కోసం’ అంది మాలతి. వెంటనే బావి తవ్వే పని మొదలైంది. మాలతి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు పలుగూ పారా తీసుకుని నాలుగైదు అడుగుల వెడల్పు ఉన్న చుట్టు బావి తవ్వడం మొదలెట్టారు. తలా కొంచెం తవ్వి పోస్తున్నారు. 14 అడుగుల లోతుకు వెళ్లాక నీళ్లు పడ్డాయి. కాని సహజంగానే అవి బురద నీరు. ఆ నీటిని తోడి పోస్తూ మరి కాస్త లోతుకు వెళితే తేట నీరు వస్తాయి. ‘నా దగ్గర డబ్బు లేదు. అయినా నీ కోసం ప్రయత్నిస్తా’ అని తండ్రి అటు తిరిగి ఇటు తిరిగి 7 వేలు తెచ్చి మాలతికి ఇచ్చాడు. మాలతి దాంతో మోటరు కొని బురద నీళ్లు బయటకు తోలించింది. మళ్లీ బావి తవ్వింది. ఇప్పుడు తేట నీళ్లు వచ్చాయి. తియ్యటి నీళ్లు. దాహం తీర్చే నీళ్లు. ఊళ్లోని అందరూ వచ్చి ఈ నీళ్లు చూసి మాలతిని పట్టుకుని మెటికలు విరిచారు. ‘మా తల్లే మా తల్లే’ అన్నారు. మాలతిని చూసి ఇంకో రెండు మూడు యువ బృందాలు మరో రెండు మూడు బావులు తవ్వుతున్నాయి. అవి పూర్తవుతున్నాయి కూడా. ఈ సంగతి తెలిసిన మీడియా మాలతి మీద కథనాలు రాసి ఆమెను ‘వాటర్ గర్ల్’గా వ్యాఖ్యానించాయి. అధికారులు కదిలారు. ‘మీ బావి ఖర్చు, కూలి ఖర్చు ఇస్తాం’ అంటున్నారు. ‘వాటి సంగతి తర్వాత నా బావికి సిమెంటు రింగులు లేవు అవి వేయించండి’ అంటోంది మాలతి. మాలతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి గొప్ప పని చేసింది’ అంటున్నారు. మాలతి ఇంతటితో ఆగాలని అనుకోవడం లేదు. గూడెంలో పిల్లలకు చదువు చెప్పాలని అనుకుంటోంది. అందరి కోసం పని చేయాలని అనుకుంటోంది. అంతా కలిసి 25 వేల జనాభా కూడా ఉండదు బోండులది. అరుదైన తెగ అది. దానిని కాపాడుకుని సంతోషంగా ఉండేలా చూడటం కూడా చేయడం లేదు ప్రభుత్వాలు. వారి కళ్లు తెరుచుకోవాలంటే ఇంటికో మాలతి అవసరమే. -
Hurricane Ida: అమెరికా వరదల్లో.. మనోళ్లు ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది. వీరిని మాలతి కంచె(46) అనే సాఫ్ట్వేర్ డిజైనర్, ధనుష్ రెడ్డి(31)గా అధికారులు గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె(15)తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు. ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. మరో ఘటన న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకుంది. ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు. -
అపర సతీసావిత్రి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్థికంగా కడుపేద అయితేనేం.. సమున్నతమైన మనసులో ఆమె ఎంతో ధనవంతురాలు. పొట్టికూటి కోసం దుబాయ్‌కి వెళ్లిన భర్త హత్య కేసులో జైలు పాలయ్యాడు. కోర్టు మరణదండన శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. తమిళనాడులో ఉన్న భార్య హృదయం తల్లడిల్లిపోయింది. అహర్నిశలు అలుపెరుగని కృషిచేసి అపర సతీ సావిత్రిలా ఉరికంబం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న భర్త ప్రాణాలను కాపాడుకుంది. మీడియా ద్వారామంగళవారం వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన అర్జున్ ఆదిముత్తు, మాలతి నిరుపేద దంపతులు. అర్జున్ దుబాయ్‌లో కూలీ పనిచేసేవాడు. దుబాయ్‌లో నివసించే కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన అబ్దుల్వాజిత్ అనే అతనిని హత్య చేసిన కేసులో ఆదిముత్తును దుబాయ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణ పూర్తికాగా అర్జున్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. భర్తకు దూరంగా తంజావూరులో అష్టకష్టాలు పడుతూ కాలం వెళ్లదీస్తున్న మాలతి ఈ సమాచారంతో హతాశురాలైంది. దుబాయ్ చట్టం ప్రకారం హతుని కుటుంబీకులు గనుక హంతకుడిని క్షమిస్తున్నట్లు ప్రకటిస్తే మరణదండన రద్దు అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న మాలతి మలప్పురంలోని ముస్లిం సంఘాలను సంప్రదించి మరణదండన నుంచి తన భర్త ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న అక్కడి ముస్లిం సంఘాలు దుబాయ్‌లోని హతుని కుటుంబీకులతో చర్చలు జరిపారు. నష్టపరిహారంగా రూ.30 లక్షలు చెల్లించేలా ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వక ఒప్పందం కుదిరింది. అయితే మాలతి కడుపేద కావడంతో తనకు అంతటి స్థోమత లేదని ముస్లిం సంఘాలతో మొరపెట్టుకుంది. దీంతో కేరళ ప్రజలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ముందుకు వచ్చి మాలతికి స్నేహహస్తాన్ని అందించారు. విరాళాలు పోగేసి సేకరించిన రూ.30 లక్షలను దుబాయ్‌లోని హతుని కుటుంబీకులకు అందజేశారు. హంతకుడికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా హతుని కుటుంబీకులు లిఖితపూర్వకంగా తమ సమ్మతాన్ని తెలియజేశారు. ఈ ఉత్తరాన్ని కోర్టులో దాఖలు చేయగా దుబాయ్ కోర్టు హంతకుడు అర్జున్‌కు విధించిన మరణదండనను రద్దు చేసి శిక్ష తగ్గించింది. అంతేగాక ఫోన్ ద్వారా భార్య మాలతితో మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించింది. తన భర్త ప్రాణాలను కాపాడేందుకు సహకరించిన కేరళ ప్రజలకు కృతజ్ఞతభావం నిండిన హృదయం, ఆనందంతో చెమర్చిన కళ్లతో ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు కేరళలోని ముస్లిం సంఘాలకు ఉత్తరం కూడా రాసింది. -
కాపురానికి రానంది అంతే...
చెన్నై : కాపురానికి రావడం ఇష్టం లేదని భార్య చెప్పడంతో ఆగ్రహించిన భర్త ఆమె చెవి కోసి పారిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి సమీపంలో బంగారం పేట కరుమారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన మారియప్పన్ (37). ఇతడు గోమాంసం దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య మాలతి (24). వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం సాయంత్రం దంపతుల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో మాలతి కోపంతో ఆమె తల్లి అములు పనిచేసే గార్డన్‌కు వెళ్లింది. విషయం తెలిసి మారియప్పన్ అర్ధరాత్రి 12 గంటలకు గార్డెన్‌కు వెళ్లాడు. మాలతిని తనతో పాటు ఇంటికి రమ్మని పిలిచాడు. అయితే మాలతి అంగీకరించలేదు. మారియప్పన్‌తో గొడవకు దిగింది. ఆగ్రహించిన మారియప్పన్ కత్తితో మాలతి కుడి చెవి కోసి పరారయ్యాడు. ఈ దాడిలో గాయపడిన మాలతిని ఆమె బంధువులు కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు పరారీలో ఉన్న మారియప్పన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతడిని అంబత్తూరు కోర్టులో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు. -
విషమించిన ఆహారం
=ఒకరి మృతి =40 మందికి అస్వస్థత =నలుగురి పరిస్థితి విషమం =ప్రత్యేక వైద్య బృందాలు పంపాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశం గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గిరిజనుల ఆహారపు అలవాటు మరోసారి ‘విష’మించింది. మారుమూల గూడేల్లోని ఆదివాసీలు చనిపోయిన పశు ల, నిల్వ మాంసం తిని ప్రాణాలమీదికి తెచ్చుకుం టున్నారు. జీకే వీధి మండలం రంపుల గ్రామంలో ఇదే చోటుచేసుకుంది. ఓ గిరిజనుడు చనిపోగా, మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. పాముకాటుకు గురై చనిపోయిన పశువు మాంసాన్ని గ్రామంలోని 40 కుటుం బాల వారు శనివారం రాత్రి వండుకుతిన్నారు. అది వికటించింది. ఒక్కసారిగా గ్రామంలోని వారంతా అనారోగ్యానికి గురయ్యారు. వాంతు లు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో కొర్ర మాలతి(40) ఆదివారం ఉదయం మృతి చెందాడు. చిన్నారులు కొర్ర గీతా(8), వాసు(5), దేవరాజు(4), పాంగి లక్ష్మీ(14)ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంజీవరావు(15)తోపాటు కొర్ర సీతా(42), కె.మూర్తి(32), లక్ష్మీ(30), పి.శాంతి(5), పి.లక్ష్మీ(28)లతోపాటు మరో 30 మందికిపైగా అనారోగ్యంతో అల్లాడుతున్నారు. పెదవలస పీహెచ్సీ వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని బాధితులకు వైద్యసేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారందరిని అంబులెన్స్‌లో పెదవలస పీహెచ్‌సీకి తరలించి అత్యవసర సేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తామని జీకే వీధి,చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ తెలిపారు. ప్రత్యేక వైద్యబృందాలను రప్పిస్తున్నామన్నారు. విషయం తెలిసిన మంత్రి బాలరాజు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాలను గ్రామానికి పంపాలని జిల్లా కలెక్టర్, వైద్య,ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో తక్షణం క్లోరినేషన్ చేపట్టాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ తరలించాలన్నారు.