ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. తొలి మ్యాచ్ ఓటమి తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలతో చెన్నై జోరు మీద ఉంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్న సీఎస్‌కే బౌలింగ్‌లో దీపక్ చహర్ కీలకంగా మారాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన చహర్ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1-13-4తో తన కెరీర్‌లోనే బెస్ట్ స్పెల్ నమోదు చేసిన చహర్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 4 వికెట్లు తీసి మొత్తం 8 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న చహర్ ఐపీఎల్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ గిల్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ సందర్భంగా దీపక్ చహర్ సోదరి మాలతీ చహర్ తమ్ముడి ప్రదర్శనపై ట్విటర్ వేదికగా స్పందించింది. ''ఈ సీజన్‌లో చహర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నందుకు కంగ్రాట్స్.. ఇంకా ఇలాంటివి నీ నుంచి చాలా రావాలి '' అంటూ ఎంకరేజ్ చేస్తూ క్యాప్షన్ జత చేసింది. మాలతీ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ''నీలాంటి అక్క దొరకడం చహర్ చేసుకున్న అదృష్టం.. సూపర్ మాలతీ.. చహర్‌కు నీ ఎంకరేజ్ చాలా అవసరం.. '' అంటూ కామెంట్లు చేశారు.
ఇక 2016 ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన దీపక్ చహర్ తొలి నుంచి సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన చహర్ రెండో సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే 2018లో దీపక్ చహర్‌ను రిటైన్ చేసుకున్న సీఎస్‌కేకు మూడో టైటిల్ దక్కడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్ సీజన్ దీపక్ చహర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన సీఎస్‌కేకు 17 మ్యాచ్‌లు ఆడిన చహర్ 22 వికెట్లతో ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో చహర్ 12 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సీఎస్‌కే తొలిసారి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 25న ముంబై వేదికగా ఆర్‌సీబీతో ఆడనుంది.
చదవండి: సీఎస్‌కేకు సపోర్ట్ చేసిన ఈ మోడల్ ఎవరో తెలుసా?
సాహోరే చహర్ బ్రదర్స్.. ఇద్దరూ సేమ్ టూ సేమ్
And many more to come 😘 @deepak_chahar9 https://t.co/15CRmKtgt8
— Malti Chahar🇮🇳 (@ChaharMalti) April 23, 2021
Comments
Please login to add a commentAdd a comment