కుల్దీప్ యాదవ్ (PC: BCCI)
India tour of Bangladesh, 2022 - 3rd ODI: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు జట్టుతో కలవనున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకున్న టీమిండియా శనివారం నాటి ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
గాయాల బెడద
ఇక రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. అయితే, నొప్పిని భరిస్తూనే మైదానంలో అడుగుపెట్టి అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రోహిత్ శ్రమ వృథాగా పోయింది.
మరోవైపు.. యువ పేసర్ కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో రెండో వన్డేకు దూరం కాగా.. దీపక్ చహర్‌ను సైతం ఫిట్‌నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. రెండో మ్యాచ్ సందర్భంగా అతడు కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టుకు ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
టెస్టులకు రోహిత్ దూరం?
అదే విధంగా... రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్, దీపక్ చహర్ స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొంది. రోహిత్ చికిత్స కోసం ముంబై ఆస్పత్రిలో స్పెషలిస్టును సంప్రదించగా.. కుల్దీప్, దీపక్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. ఇక కెప్టెన్ రోహిత్ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అంశంపై వీలైనంత త్వరగా అప్‌డేట్ ఇస్తామని మేనేజ్‌మెంట్ పేర్కొంది.
బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.
చదవండి: Ind A Vs Ban A: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి
Comments
Please login to add a commentAdd a comment