Kuldeep Sen
-
కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. రాజస్థాన్‌పై గుజరాత్ సంచలన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్లో 20 పరుగులిచ్చి గుజరాత్‌ను గెలుపు లైన్లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్‌మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. -
కుల్దీప్ సేన్ విజృంభణ.. గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ చెలరేగిపోయాడు. 10 బంతుల వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న గుజరాత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్ రెండో బంతికి సాయి సుదర్శన్‌ను (35) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపిన సేన్.. ఆతర్వాత 11వ ఓవర్ తొలి బంతికి, నాలుగో బంతికి మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్‌ను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు. 147.3kmph.145kmph.Kuldeep Sen has rattled the Gujarat Titans top order. 🔥 pic.twitter.com/DdtR6KxALO— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 సేన్ ధాటికి గుజరాత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సేన్ అనంతరం చహల్ గుజరాత్ బ్యాటర్లను పరేషాన్ చేశాడు. చహల్ 14వ ఓవర్లో విజయ్ శంకర్ (16), 16వ ఓవర్లో శుభ్‌మన్ గిల్‌ను (72) చాకచక్యంగా బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా చహల్ గిల్‌ను ఔట్ చేసే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. Kuldeep Sen with 145kmph beauty. 🤯🔥 pic.twitter.com/TLxbWMwjjU— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 గిల్ క్రీజ్ దాటి వస్తాడని ముందుగానే పసిగట్టిన చహల్.. తెలివిగా వైడ్ వేయగా.. ఇది తెలియని గిల్ ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టంప్ ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 138/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. -
కెప్టెన్‌గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్‌కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సుందర్‌కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
Ind Vs Ban: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్
India tour of Bangladesh, 2022 - 3rd ODI: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు జట్టుతో కలవనున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకున్న టీమిండియా శనివారం నాటి ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. గాయాల బెడద ఇక రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. అయితే, నొప్పిని భరిస్తూనే మైదానంలో అడుగుపెట్టి అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రోహిత్ శ్రమ వృథాగా పోయింది. మరోవైపు.. యువ పేసర్ కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో రెండో వన్డేకు దూరం కాగా.. దీపక్ చహర్‌ను సైతం ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. రెండో మ్యాచ్ సందర్భంగా అతడు కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టుకు ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. టెస్టులకు రోహిత్ దూరం? అదే విధంగా... రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్, దీపక్ చహర్ స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొంది. రోహిత్ చికిత్స కోసం ముంబై ఆస్పత్రిలో స్పెషలిస్టును సంప్రదించగా.. కుల్దీప్, దీపక్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. ఇక కెప్టెన్ రోహిత్ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అంశంపై వీలైనంత త్వరగా అప్డేట్ ఇస్తామని మేనేజ్మెంట్ పేర్కొంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్. చదవండి: Ind A Vs Ban A: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి -
బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు
బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన భారత్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ పేసర్లు దీపక్ చహర్, కుల్దీప్ సేన్ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నారు. ఢాకా వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ చేతి వేలికి గాయం కాగా.. దీపక్ చహర్‌కు కండరాలు పట్టేశాయి. అదే విధంగా తొలి వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ పేసర్ కుల్దీప్ సేన్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరు ముగ్గురు గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. ఈ విషయాన్ని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దృవీకరించాడు. ఇక అఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టు కోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే చటోగ్రామ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అయితే దీపక్, రోహిత్,కుల్దీప్ రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం జట్టులో సిరాజ్, శార్థూల్, ఉమ్రాన్ మినహా అదనపు పేసర్ ఒక్కరు కూడా లేరు. ఇక బంగ్లాతో అఖరి వన్డేకు రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్ భారత కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించున్నాడు. చదవండి: చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్ శర్మ -
అందుకే కుల్దీప్ స్థానంలో ఉమ్రాన్‌ను ఆడిస్తున్నాం: రోహిత్ శర్మ
Ind Vs Ban 2nd ODI Playing XI: బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా అరంగేట్రం చేసిన టీమిండియా యువ బౌలర్ కుల్దీప్ సేన్ రెండో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు యువ పేసర్ కుల్దీప్ సేన్. ఢాకా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ మధ్యప్రదేశ్ బౌలర్.. 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన భారత బౌలర్లతో పోలిస్తే పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మద్‌ను తప్పించి అక్షర్‌కు స్థానం ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో పోటీలో నిలవాలంటే బుధవారం నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. కుల్దీప్ సెలక్షన్‌కు అందుబాటులో లేడని.. అందుకే అతడి స్థానాన్ని ఉమ్రాన్‌తో భర్తీ చేసినట్లు పేర్కొన్నాడు. కారణమిదే! మొదటి వన్డే సందర్భంగా వెన్నునొప్పితో కుల్దీప్ సేన్ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ప్రకటన విడుదల చేసింది. బంగ్లాతో రెండే వన్డే- భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ A look at our Playing XI for the 2nd ODI. Kuldeep Sen complained of back stiffness following the first ODI on Sunday. The BCCI Medical Team assessed him and has advised him rest. He was not available for selection for the 2nd ODI.#BANvIND pic.twitter.com/XhQxlQ6aMZ — BCCI (@BCCI) December 7, 2022 -
Ind Vs Ban: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్‌దే
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI Updates: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్‌దే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. బారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గాయం కారణంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడనప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్ రెండు, ముస్తిఫిజర్, మహ్మదుల్లా తలా వికెట్ సాధించారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 213 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రోహిత్(20), సిరాజ్ ఉన్నారు. 46 ఓవర్ వేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ సాయంతో 16 పరుగలు రాబట్టాడు. గాయంతో రోహిత్ బాధపడుతన్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. భారత విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఆరో వికెట్ కోల్పోయిన భారత్ 189 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన అయ్యర్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి 90 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. అయ్యర్ హాఫ్ సెంచరీ ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం పోరాడతున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని కూడా అయ్యర్ పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(50), అక్షర్ పటేల్(21) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్ 65 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రాహుల్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(11), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు టీమిండియా స్కోర్:34/2 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(12), వాషింగ్టన్ సుందర్(8) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 13 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ధావన్.. ముస్తిఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత్‌కు బిగ్ షాక్.. విరాట్ కోహ్లి ఔట్ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి వికెట్‌ను భారత్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కోహ్లి ఎబాదత్ హోస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రాణించిన మిరాజ్, మహ్మదుల్లా టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ ఆదుకున్నారు. ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ 4పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్‌కు రెండు, సుందర్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఏడో వికెట్ డౌన్ 46.1: చాలా సమయం తర్వాత భారత్‌కు వికెట్ లభించింది. అద్బుత ంగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ జోడీని ఉమ్రాన్ మాలిక్ విడదీశాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో మహ్మదుల్లా(77) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. నాసూమ్ అహ్మద్, మిరాజ్ క్రీజులో ఉన్నారు. బంగ్లా స్కోరు: 231/7 (47) మెరిసిన మహ్మదుల్లా మహ్మదుల్లా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 41 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు- 178-6 మిరాజ్ అర్ధ శతకం రెండో వన్డేలో బంగ్లా బ్యాటర్ మిరాజ్ అర్ధ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా మహ్మదుల్లా(46) రాణిస్తున్నాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో 39 ఓవర్లలో బంగ్లా 167 పరుగులు చేయగలిగింది. భారత జట్టు బౌలర్లను మార్చినా ఏ ఒక్కరు కూడా ఈ జోడీని విడదీయలేకపోతున్నారు. నిలకడగా మిరాజ్ మిరాజ్ నిలకడగా ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మహ్మదుల్లా(35)తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. 35 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు-149/6 30 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 124/6 మహ్మదుల్లా 26, మిరాజ్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి వన్డేలో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మిరాజ్.. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సరికి మహ్మదుల్లా 21, మిరాజ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎట్టకేలకు 100 పరుగుల మార్కు భారత బౌలర్ల విజృంభణతో టాప్, మిడిలార్డర్ కుదేలు కాగా.. బంగ్లా 26 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు నష్టపోయి 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఇప్పటి వరకు సుందర్‌కు మూడు, సిరాజ్‌కు రెండు, ఉమ్రాన్‌కు ఒక వికెట్ దక్కాయి. సుందర్ మ్యాజిక్! 18.6: వాషింగ్టన్ సుందర్ అద్భుతం చేశాడు. ముష్ఫికర్‌ను పెవిలియన్‌కు పంపిన మరుసటి బంతికే అఫిఫ్ హొసేన్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 19 ఓవర్లలో బంగ్లా స్కోరు: 69-6 ఐదో వికెట్ ఢమాల్ 18.5: ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్.. ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సుందర్‌కు ఇది రెండో వికెట్. షకీబ్ అవుట్! 16.6: భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ రెండు వికెట్లు కూల్చగా.. ఉమ్రాన్ అద్భుత బంతితో షాంటోను బౌల్డ్ చేశాడు. ఇక 17వ ఓవర్ చివరి బంతికి షకీబ్(8)ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ సైతం ఖాతా తెరిచాడు. దీంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లలో బంగ్లా స్కోరు: 66-4 మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 52 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల చేసిన షాంటోను ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్‌చేశాడు. వారెవ్వా సిరాజ్ బంగ్లాతో రెండో వన్డేలో భారత బౌలర్లు ఆది నుంచి కట్టడిగా బౌలింగ్ చేస్తున్నారు. రెండో ఓవర్లోనే వికెట్ తీసిన సిరాజ్ వికెట్.. పదో ఓవర్లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను బౌల్డ్ చేశాడు. మరోవైపు.. తన మొదటి 2 ఓవర్లలో శార్దూల్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీపక్ చహర్ 3 ఓవర్లు బౌల్ చేసిన 12 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. రెండో వికెట్ డౌన్ 9.2: సిరాజ్ మరోసారి బంగ్లాను దెబ్బకొట్టాడు. కెప్టెన్ లిటన్ దాస్(7)ను బౌల్డ్ చేసి రెండో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. షకీబ్, షాంటో క్రీజులో ఉన్నారు. ►ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 23/1 తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా 1.5: అనముల్ హక్ రూపంలో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అనముల్(11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షాంటో క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ లిటన్ దాస్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 11-1 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక్ను బంగ్లాదేశ్ టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. తొలి వన్డేలో బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు... బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. రోహిత్ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, పేసర్ కుల్దీప్ సేన్ స్థానంలో కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా కుల్దీప్ మొదటి వన్డేతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్- టీమిండియా ఢాకా వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉండగా.. కచ్చితంగా గెలిచి స్వదేశంలో గత సిరీస్ ఫలితాన్ని పునరావృతం చేయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు! -
చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి
India tour of Bangladesh, 2022- Bangladesh vs India: టీమిండియా బ్యాటర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. బౌలర్లను తప్పుబట్టడం సరికాదని.. చెత్త బ్యాటింగ్ వల్లే బంగ్లాదేశ్ చేతిలో రోహిత్ సేన ఓడిపోయిందని పేర్కొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న కైఫ్,.. ఇకనైనా ‘హిట్‌మ్యాన్’ బ్యాట్ ఝులిపించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం నాటి తొలి వన్డేలోనే భారత్‌కు పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(27) సహా సీనియర్లు శిఖర్ ధావన్(7), విరాట్ కోహ్లి(9) విఫలమయ్యారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే అర్ధ శతకం(73 పరుగులు)తో రాణించడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గౌరవప్రదమైన(186) స్కోరు చేయగలిగింది. అయితే, భారత బౌలర్లు ఫర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్య ఛేదనలో బంగ్లాను మెహదీ, ముస్తాఫిజుర్ ఆదుకోవడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లు.. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్తగా ఆడారు.. ఇక బుధవారం ఇరు జట్లు రెండో వన్డేలో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మనం ఎక్కువగా భారత బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతున్నాం. నిజానికి మొదటి వన్డేలో బ్యాటర్లు చెత్తగా ఆడారు. కేవలం బ్యాటింగ్ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిపోయింది. విరాట్ కోహ్లి పరుగులు సాధించాలి. ముఖ్యంగా కెప్టెన్.. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావాలి. గత కొంతకాలంగా తన వైఫల్యం కొనసాగుతోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు’’ అని కైఫ్.. రోహిత్ తీరును విమర్శించాడు. కుల్దీప్ను అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి.. ఇక రెండో వన్డే నేపథ్యంలో.. యువ బౌలర్ కుల్దీప్ సేన్‌కు కైఫ్ మద్దతుగా నిలిచాడు. అతడిని సిరీస్ మొత్తం ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘ఒకవేళ వాళ్లు రెండో వన్డేకు తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. గందరగోళం ఏర్పడుతుంది. యువ ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటే కచ్చితంగా కుల్దీప్ సేన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వాలి. తను మొదటి వన్డేతో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. అయితే, పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. తన బౌలింగ్‌లో పేస్ ఉంది. కానీ ఒత్తిడిలో కూరుకుపోవడం వల్ల సరిగ్గా ఆడలేకపోయాడు. అయినా, తనకిది మొదటి మ్యాచ్. కాబట్టి మరో అవకాశం ఇవ్వాలి. నిజానికి ఒక్క మ్యాచ్ ఓడితే జట్టులో మార్పులు చేయడం సరికాదు. అలా చేస్తే ఆ జట్టు కెప్టెన్ లేదంటే సరైన వాళ్లు అనిపించుకోరు’’ అంటూ యువ పేసర్ కుల్దీప్ సేన్‌కు మాజీ బ్యాటర్ కైఫ్ అండగా నిలబడ్డాడు. కాగా మొదటి వన్డేలో 5 ఓవర్లు బౌల్ చేసిన కుల్దీప్ సేన్ 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! Hasan Ali: హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్ -
బార్బర్ కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ క్రికెటర్‌గా.. ఎవరీ కుల్దీప్ సేన్?
ప్రపంచ క్రికెట్లో భారత్‌కు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి భారత క్రికెట్ పరిచయం చేసింది. ఇప్పుడు మరో నిరుపేద కుటంబం నుంచి వచ్చిన ఓ యువకుడు భారత క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించేందుకు సిద్దమయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన యువ పేసర్ కుల్దీప్ సేన్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టులో కుల్దీప్ సేన్‌కు చోటు దక్కింది. ఒక బార్బర్ కుటంబంలో పుట్టి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన కుల్దీప్ సేన్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ కుల్దీప్ సేన్? 26 ఏళ్ల కుల్దీప్ సేన్ మధ్యప్రదేశ్‌లో రెవా జిల్లాలోని చిన్న గ్రామం హరిహర్పూర్లో జన్మించాడు. కుల్దీప్ తండ్రి రాంపాల్ సేన్ తన గ్రామంలోనే చిన్న హెయిర్ సెలూన్ నడుపుతూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. రాంపాల్‌కు ఐదుగురు సంతానం. వారిలో కుల్దీప్ సేన్ మూడవ వాడు. కుల్దీప్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా సరిగ్గా లేకపోయేది. కాగా చిన్నతనం నుంచి కుల్దీప్కు క్రికెట్ అంటే పిచ్చి. అయితే అతడికి కనీసం క్రికెట్ కిట్ కూడా కొనిచ్చే స్థోమత తన తండ్రికి లేదు. ఈ సమయంలో కుల్దీప్కు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని చూసిన ఆంథోనీ అనే కోచ్ అతడికి అన్ని విధాలుగా అండగా నిలిచాడు. కుల్దీప్ సేన్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి రుసుము కూడా ఆంథోనీ వసులు చేయలేదు. అతడికి క్రికెట్ కిట్స్‌తో పాటు మంచి ఆహారాన్ని కూడా ఆంథోనీ అందించేవాడు. ఇలా ఒక యువ ఫాస్ట్ బౌలర్ భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడంలో ఆంథోనీ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ క్రికెట్ కెరీర్.. కుల్దీప్ సరిగ్గా ఒక దశాబ్దం క్రితం వింధ్య క్రికెట్ అకాడమీ క్లబ్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. వింధ్య క్రికెట్ అకాడమీ నిర్వహకులు కూడా కుల్దీప్ కుటంబ పరిస్థితి చూసి ఎటువంటి ఫీజ్‌లు తీసుకోలేదు. ఇక 2018 రంజీట్రోఫీ సీజన్లో మధ్యప్రదేశ్ తరపున కుల్దీప్ ఫస్ల్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. డెబ్యూ సీజన్లోనే ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 52 వికెట్లు సాధించాడు. కుల్దీప్ అద్భుతమైన ఔట్ స్వింగ్ డెలివిరిలను సందించగలడు. గంటకు 140 కి.మీ పైగా వేగంతో కుల్దీప్ బౌలింగ్ చేయగలడు. అదే విధంగా అతడు 13 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఎ కెరీర్లో 25 వికెట్లు, టీ20ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఎంట్రీ ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ సేన్‌ను ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో రూ. 20 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అరంగేట్ర సీజన్లోనే కుల్దీప్ అకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సేన్.. తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక యువ బౌలర్‌కు భారత జట్టులో అవకాశం ఇవ్వడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. A special moment! ☺️ Congratulations to Kuldeep Sen as he is set to make his India debut! 👏 👏 He receives his #TeamIndia cap from the hands of captain @ImRo45. 👍 👍#BANvIND pic.twitter.com/jxpt3TgC5O — BCCI (@BCCI) December 4, 2022 చదవండి: ND VS BAN 1st ODI: చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్.. వన్డే వరల్డ్‌కప్ వరకైనా ఉంటాడా..? -
ఉమ్రాన్ మాలిక్‌కు వీసా కష్టాలు..ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇబ్బందులు
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు నెట్ బౌలర్‌గా ఎంపికైన కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు వీసా కష్టాలు ఎదురయ్యాయి. వీసా ప్రక్రియలో సమస్య కారణంగా అతను ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టుతో కలవడం మరింత ఆలస్యం కానుంది. దీంతో ప్రస్తుతానికి అతను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇవాళ (అక్టోబర్ 11) ఉమ్రాన్ ప్రాతినిధ్యం వహించే జమ్మూ కశ్మీర్ జట్టు.. మొహాలీ వేదికగా మేఘాలయాతో తలపడనుంది. కాగా, ఉమ్రాన్‌తో పాటు మధ్యప్రదేశ్ పేసర్ కుల్దీప్ సేన్‌ను కూడా భారత నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే కుల్దీప్ సేన్‌కు కూడా వీసా సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరితో పాటు హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ కూడా నెట్‌బౌలర్‌గా టీమిండియాతో పాటే అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సింది. అయితే సిరాజ్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం.. ఉమ్రాన్, కుల్దీప్కు వీసా కష్టాలు ఎదురవ్వడంతో ముగ్గురు భారత్‌లోనే ఉండిపోయారు. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ పిచ్‌లపై ప్రత్యర్ధులను ఎదుర్కోవాలంటే ప్రాక్టీస్‌లో ఫాస్ట్ బౌలర్లు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ ముగ్గురుని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. అయితే వివిధ కారణాల చేత ఈ ముగ్గురు ఇండియాలోనే ఉండిపోవడంతో అక్కడ టీమిండియా ప్రాక్టీస్‌లో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నెట్ బౌలర్లు ఎంత తొందరగా ఆస్ట్రేలియాకు వెళ్లగలిగితే టీమిండియాకు అంత ఉపయోగమవుతుంది. ఉమ్రాన్, కుల్దీప్లు వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్స్‌గా ఎంపికై, ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న ప్లేయర్స్‌తో పాటు అక్టోబర్ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ.. రెస్ట్ ఆఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. కోన శ్రీకర్ భరత్ 27 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్(138 పరుగులు) సెంచరీతో మెరవగా.. హనుమ విహారి 82 పరుగులు చేయగా సౌరబ్ కుమార్ 55 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేయగా.. ప్రేరక్ మాన్కడ్ 72 పరుగులతో రాణించాడు. ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 31.5 ఓవర్లలో చేధించి 8 వికెట్ల తేడాతో గెలిచి ఇరానీ కప్‌ను ఒడిసిపట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఓవరాల్‌గా ఎనిమిది వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ కుల్దీప్ సేన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్ కావడం విశేషం. Winners Are Grinners! ☺️ 🙌 Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP — BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022 చదవండి: టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన.. 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం -
చెలరేగిన ముకేశ్, ఉమ్రాన్, కుల్దీప్ సేన్.. 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్
Irani Cup 2022 - Saurashtra vs Rest of India: ఇరానీ కప్-2022 టోర్నీలో భాగంగా సౌరాష్ట్ర- రెస్టాఫ్ ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శనివారం ఆట మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. కుప్పకూలిన టాపార్డర్ రెస్టాఫ్ ఇండియా బౌలర్ల ధాటికి సౌరాష్ట్ర టాపార్డర్ కకావికలమైంది. 0,4,0,1,2.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ పతనం సాగింది. ఛతేశ్వర్ పుజారా(1) సహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయ్యారు. ఇక ఆరో స్థానంలో వచ్చిన అర్పిత్ వసవాడ 22 పరుగులు, తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధర్మేంద్ర సిన్హ్ జడేజా 28 పరుగులతో రాణించారు. 98 పరుగులకే ఆలౌట్ ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్ అయింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక కుల్దీప్ సేన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రంజీ ట్రోఫీ 2019- 20 విజేత సౌరాష్ట్రతో పోరులో వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక సౌరాష్ట్ర జట్టుకు సారథి జయదేవ్ ఉనద్కట్. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్! ICYMI! Watch how Mukesh Kumar set the ball rolling for Rest of India 🎥 🔽 #IraniCup | #SAUvROI | @mastercardindia https://t.co/GLg0dQvfNj — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
Ind A vs NZ A: చెలరేగిన భారత బౌలర్లు.. 167 పరుగులకే కివీస్ ఆలౌట్
India A vs New Zealand A, 1st unofficial ODI- NZ Score: న్యూజిలాండ్- ఏ జట్టుతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. శార్దూల్ ఠాకూర్ 4, కుల్దీప్ సేన్ 3 వికెట్లు పడగొట్టి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక కుల్దీప్ యాదవ్ సైతం 9 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 40.2 ఓవర్లకే న్యూజిలాండ్ కథ ముగిసింది. 167 పరుగులు చేసి రాబర్ట్ ఒడొనెల్ బృందం ఆలౌట్ అయింది. కాగా మూడు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడే నిమిత్తం న్యూజిలాండ్- ఏ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో మ్యాచ్‌లో భారత ఏ జట్టు 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గురువారం మొదటి వన్డే ఆరంభమైంది. టాస్ గెలిచిన సంజూ శాంసన్.. చెలరేగిన బౌలర్లు టాస్ గెలిచిన భారత ఏ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆది నుంచే చుక్కలు చూపించారు బౌలర్లు. ఓపెనర్లు చెరో పది పరుగులు చేసి అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం వరుసగా 4,1,22,0,5 పరుగులు చేసి పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాపార్డర్ కుప్పకూలిన వేళ మైఖేల్ రిప్పన్ 104 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టెయిలెండర్ జో వాకర్ సైతం 36 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో 167 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. చదవండి: Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే! LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం -
'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి'
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ పుకార్లని బీసీసీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం మధ్యాహ్నం దీపక్ చహర్ గాయంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడని.. అతని స్థానంలో కుల్దీప్ సేన్‌ను స్లాండ్ బై ప్లేయర్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ.. అవన్నీ తప్పుడు వార్తలని.. దీపక్ చహర్ జట్టుతోనే ఉన్నాడని తెలిపింది. ''దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అదంతా నాన్సెన్స్. దీపక్ చహర్ ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న అతను ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రాజస్తాన్ రాయల్స్ బౌలర్ కుల్దీప్ సేన్‌ను కేవలం నెట్‌బౌలర్‌గానే జట్టులోకి తీసుకున్నాయి. టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే కుల్దీప్ సేన్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేశాము. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.. కానీ జట్టులోకి రావడానికి సమయం ఉంది.'' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కుల్దీప్ సేన్(PC: IPL Twitter) ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరంగా ఉన్న దీపక్ చాహార్, కమ్‌బ్యాక్ తర్వాత జింబాబ్వేతో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈలోగానే దీపక్ చాహార్ మళ్లీ గాయపడ్డాడనే వార్తలు రావడం అతని ఫ్యాన్స్‌ని కలవరబెట్టింది. అయితే దీపక్ చహర్‌కు ఏం కాలేదని తెలుసుకొని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో భువనేశ్వర్ కుమార్ సీనియర్ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. అతనితో పాటు టోర్నీకి ఎంపికైన ఆవేశ్ ఖాన్ జింబాబ్వే టూర్లో అట్టర్ ఫ్లాప్ కాగా... అర్ష్‌దీప్ సింగ్‌కి పట్టుమని ఐదు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు. దీంతో దీపక్ చహర్ స్టాండ్-బైగా ఉన్నప్పటికి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ స్టాండ్ బై - శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ నెట్ బౌలర్- కుల్దీప్ సేన్ చదవండి: ఆరోజు కోహ్లి రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేశాడు.. నేను షాకయ్యా! కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి' -
‘త్వరలోనే టీమిండియాకు ఆడతాడు’.. ఎవరీ కుల్దీప్ సేన్?!
IPL 2022 RR Vs LSG: గెలుపోటములను తేల్చే ఆఖరి ఓవర్లో బంతితో అద్భుతం చేసి రాజస్తాన్ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్. లక్నో సూపర్‌జెయింట్స్ గెలుపునకు 15 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌ను తన వైవిధ్యమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. తద్వారా, అతడిని కట్టడి చేసి లక్నో ఓటమిని శాసించాడు. ఈ క్రమంలో కుల్దీప్ సేన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎంట్రీలోనే అదరగొట్టిన ఈ యువ క్రికెటర్ ఆట తీరును కెప్టెన్ సంజూ శాంసన్ కొనియాడాడు. అతడి ప్రతిభ అమోఘమని, త్వరలోనే టీమిండియాకు ఆడతాడంటూ వ్యాఖ్యానించాడు. ఇక రాజస్తాన్ హెడ్‌కోచ్ కుమార సంగక్కర సైతం కుల్దీప్ టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 సీజన్లో అయుష్ బదోని, వైభవ్ ఆరోరా, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లతో పాటు మరో ఆణిముత్యం దొరికిందంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరీ కుల్దీప్ సేన్?! మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో గల హరిహాపూర్ కుల్దీప్ స్వస్థలం. అతడి తండ్రి రాంపాల్ సేన్ స్థానికంగా చిన్నపాటి సెలూన్ నడుపుతున్నారు. కుల్దీప్ సేన్‌కు నలుగురు తోబుట్టువులు. క్రికెట్‌పై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న అతడు.. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆడటం మొదలుపెట్టాడు. స్థానిక అకాడమీ అతడి ఫీజును మాఫీ చేసిందంటే ఆట పట్ల కుల్దీప్‌నకు ఉన్న అంకితభావం, ప్రేమ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 2018లో ఈ మీడియం పేసర్ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఇందులో భాగంగా పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ సేన్.. 44 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ముంబైతో టీ20 మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్లో కుల్దీప్ అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ ఫార్మాట్లో 12 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ సేన్‌ను ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకున్న కుల్దీప్ సేన్35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీపక్ హుడాను అవుట్ చేయడంతో పాటు ఆఖరి ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చదవండి: IPL 2022: కుల్దీప్.. కుల్దీప్.. అదరగొట్టారుగా! ఇద్దరూ సూపర్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చహల్, కుల్దీప్పై సంజూ ప్రశంసలు.. అశ్విన్ విషయంలో అందుకే అలా!
రెండు విజయాలు.. ఆ తర్వాత ఓటమి.. తాజాగా మరో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లో ఏడో స్థానానికే పరిమితమైన సంజూ సేన.. ఐపీఎల్-2022 ఎడిషన్ ఆరంభంలో మాత్రం అదరగొడుతోంది. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాలు నమోదు చేసిన రాజస్తాన్.. ఆర్సీబీ చేతిలో మాత్రం ఓడింది. అయితే, ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కేవలం 3 పరుగుల తేడాతో గెలుపొందింది. సమిష్టి కృషితో ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘టేబుల్ టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ సేన్ తన మొదటి మూడు ఓవర్లు ఎలా వేస్తాడో గమనించి ఆఖర్లో అవకాశం ఇవ్వాలని భావించాం. అనుకున్నట్లుగానే తను పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా వైడ్ యార్కర్లు వేయాలన్న ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వైడ్ యార్కర్లతో తను చెలరేగిన తీరును మేము చూశాం. ఇక బౌల్ట్ గురించి చెప్పాలంటే.. తను మొదటి బంతి వేసే ముందుకు నా దగ్గరకు వచ్చి... తాను ఎలా బౌలింగ్ చేయబోతున్నాడో చెప్పాడు’’ అని సంజూ తెలిపాడు. అదే విధంగా.. ‘‘హెట్‌మైర్‌తో నా సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. తిన్నావా.. బాగా నిద్రపోయావా... అంతా బాగానే ఉందా! అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతడి ఆట తీరు అమోఘం. తన అనుభవం మాకెంతగానో పనికివచ్చింది’’ అని హెట్‌మెయిర్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘చహల్.. ఒకటి నుంచి ఇరవై ఓవర్లలో ఎప్పుడైనా తన సేవలను ఉపయోగించుకోవచ్చు. టీమిండియాలో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్నున మేము ఎందుకు వదులుతాం. ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచాలంటే తను రంగంలోకి దిగాల్సిందే’’ అని సంజూ.. యజువేంద్ర చహల్‌ను కొనియాడాడు. ఇక అశ్విన్ రిటైర్డ్ అవుట్ గురించి చెబుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితులు ఎదురైన సమయంలో ఈ అప్షన్ ఉపయోగించుకోవాలని మేము ముందే అనుకున్నాం. ఇది జట్టు నిర్ణయం’’ అని సంజూ స్పష్టం చేశాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. చదవండి: IPL 2022: కుల్దీప్.. కుల్దీప్.. అదరగొట్టారుగా! ఇద్దరూ సూపర్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });