ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ చెలరేగిపోయాడు. 10 బంతుల వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న గుజరాత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్ రెండో బంతికి సాయి సుదర్శన్‌ను (35) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపిన సేన్.. ఆతర్వాత 11వ ఓవర్ తొలి బంతికి, నాలుగో బంతికి మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్‌ను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.
147.3kmph.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024
145kmph.
Kuldeep Sen has rattled the Gujarat Titans top order. 🔥 pic.twitter.com/DdtR6KxALO
సేన్ ధాటికి గుజరాత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సేన్ అనంతరం చహల్ గుజరాత్ బ్యాటర్లను పరేషాన్ చేశాడు. చహల్ 14వ ఓవర్‌లో విజయ్ శంకర్ (16), 16వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్‌ను (72) చాకచక్యంగా బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా చహల్ గిల్‌ను ఔట్ చేసే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు.
Kuldeep Sen with 145kmph beauty. 🤯🔥 pic.twitter.com/TLxbWMwjjU
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024
గిల్ క్రీజ్ దాటి వస్తాడని ముందుగానే పసిగట్టిన చహల్.. తెలివిగా వైడ్ వేయగా.. ఇది తెలియని గిల్ ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టంప్ ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 138/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment