రాజస్తాన్ రాయల్స్ జట్టు(PC: IPL/BCCI)
రెండు విజయాలు.. ఆ తర్వాత ఓటమి.. తాజాగా మరో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఏడో స్థానానికే పరిమితమైన సంజూ సేన.. ఐపీఎల్-2022 ఎడిషన్ ఆరంభంలో మాత్రం అదరగొడుతోంది. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాలు నమోదు చేసిన రాజస్తాన్.. ఆర్సీబీ చేతిలో మాత్రం ఓడింది.
అయితే, ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కేవలం 3 పరుగుల తేడాతో గెలుపొందింది. సమిష్టి కృషితో ఈ సీజన్‌లో మూడో విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘టేబుల్ టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ సేన్ తన మొదటి మూడు ఓవర్లు ఎలా వేస్తాడో గమనించి ఆఖర్లో అవకాశం ఇవ్వాలని భావించాం.
అనుకున్నట్లుగానే తను పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా వైడ్ యార్కర్లు వేయాలన్న ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వైడ్ యార్కర్లతో తను చెలరేగిన తీరును మేము చూశాం. ఇక బౌల్ట్ గురించి చెప్పాలంటే.. తను మొదటి బంతి వేసే ముందుకు నా దగ్గరకు వచ్చి... తాను ఎలా బౌలింగ్ చేయబోతున్నాడో చెప్పాడు’’ అని సంజూ తెలిపాడు.
అదే విధంగా.. ‘‘హెట్‌మైర్‌తో నా సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. తిన్నావా.. బాగా నిద్రపోయావా... అంతా బాగానే ఉందా! అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతడి ఆట తీరు అమోఘం. తన అనుభవం మాకెంతగానో పనికివచ్చింది’’ అని హెట్‌మెయిర్‌పై ప్రశంసలు కురిపించాడు.
‘‘చహల్.. ఒకటి నుంచి ఇరవై ఓవర్లలో ఎప్పుడైనా తన సేవలను ఉపయోగించుకోవచ్చు. టీమిండియాలో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్‌నున మేము ఎందుకు వదులుతాం. ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచాలంటే తను రంగంలోకి దిగాల్సిందే’’ అని సంజూ.. యజువేంద్ర చహల్‌ను కొనియాడాడు.
ఇక అశ్విన్ రిటైర్డ్ అవుట్ గురించి చెబుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితులు ఎదురైన సమయంలో ఈ అప్షన్ ఉపయోగించుకోవాలని మేము ముందే అనుకున్నాం. ఇది జట్టు నిర్ణయం’’ అని సంజూ స్పష్టం చేశాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు.
చదవండి: IPL 2022: కుల్దీప్.. కుల్దీప్.. అదరగొట్టారుగా! ఇద్దరూ సూపర్!
Comments
Please login to add a commentAdd a comment