Ind vs Ban 2nd ODI: Umran Malik set to return, Kuldeep Sen is out
Sakshi News home page

Ind Vs Ban 2nd ODI: పోరాడి ఓడిన భారత్‌.. సిరీస్‌ బంగ్లాదేశ్‌దే

Published Wed, Dec 7 2022 11:02 AM | Last Updated on Wed, Dec 7 2022 9:01 PM

Ind Vs Ban 2nd ODI: Toss Playing XI Highlights Updates In Telugu - Sakshi

India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI Updates

పోరాడి ఓడిన భారత్‌.. సిరీస్‌ బంగ్లాదేశ్‌దే
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.  బారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 82 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

గాయం కారణంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడనప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్‌ రెండు, ముస్తిఫిజర్‌, మహ్మదుల్లా తలా వికెట్‌ సాధించారు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
213 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఎబాదట్‌ హేస్సేన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  క్రీజులో రోహిత్‌(20), సిరాజ్‌ ఉన్నారు. 46 ఓవర్‌ వేసిన ఎబాదట్‌ హేస్సేన్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌ సాయంతో 16 పరుగలు రాబట్టాడు. గాయంతో రోహిత్‌ బాధపడుతన్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. భారత విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. 

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
189 పరుగుల వద్ద భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌.. ఎబాదట్‌ హేస్సేన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. అయ్యర్‌ ఔట్‌
అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ వికెట్‌ను భారత్‌ కోల్పోయింది.  82 పరుగులు చేసిన అయ్యర్‌.. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి 90 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్‌ పటేల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ ఉన్నారు.

అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ శ్రేయస్‌ అ‍య్యర్‌ మాత్రం పోరాడతున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్‌ సెంచరీని కూడా అయ్యర్‌ పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో అయ్యర్‌(50), అక్షర్‌ పటేల్‌(21) పరుగులతో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రాహుల్‌ ఔట్‌
65 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రాహుల్‌.. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.

17 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 60/3
17 ఓవ‍ర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌(11), శ్రేయస్‌ అయ్యర్‌(23) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
39 పరుగులు వద్ద టీమిం‍డియా మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌.. షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

8 ఓవర్లకు టీమిండియా స్కోర్‌:34/2
8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌(12), వాషింగ్టన్‌ సుందర్‌(8) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
13 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ధావన్‌.. ముస్తిఫిజర్‌ రెహ్మన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

భారత్‌కు బిగ్‌ షాక్‌.. విరాట్‌ కోహ్లి ఔట్‌
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లి వికెట్‌ను భారత్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కోహ్లి ఎబాదత్‌ హోస్సేన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

రాణించిన మిరాజ్‌, మహ్మదుల్లా
టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ మెరుగైన స్కోరు చేయగలిగింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్‌ మిరాజ్‌ ఆదుకున్నారు. ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్‌ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ 4పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్‌కు రెండు, సుందర్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

ఏడో వికెట్‌ డౌన్‌
46.1: చాలా సమయం తర్వాత భారత్‌కు వికెట్‌ లభించింది. అద్బుత ంగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్‌ జోడీని ఉ‍మ్రాన్‌ మాలిక్‌ విడదీశాడు. ఉమ్రాన్‌ బౌలింగ్‌లో మహ్మదుల్లా(77) రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లా ఏడో వికెట్‌ కోల్పోయింది. నాసూమ్‌ అహ్మద్‌, మిరాజ్‌ క్రీజులో ఉన్నారు. బంగ్లా స్కోరు: 231/7 (47)

మెరిసిన మహ్మదుల్లా
మహ్మదుల్లా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 41 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ స్కోరు- 178-6

మిరాజ్‌ అర్ధ శతకం
రెండో వన్డేలో బంగ్లా బ్యాటర్‌ మిరాజ్‌ అర్ధ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా మహ్మదుల్లా(46) రాణిస్తున్నాడు.  వీరిద్దరి నిలకడైన ఆటతో 39 ఓవర్లలో బంగ్లా 167 పరుగులు చేయగలిగింది. భారత జట్టు బౌలర్లను మార్చినా ఏ ఒక్కరు కూడా ఈ జోడీని విడదీయలేకపోతున్నారు.

నిలకడగా మిరాజ్‌
మిరాజ్‌ నిలకడగా ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మహ్మదుల్లా(35)తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. 35 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు-149/6

30 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు: 124/6
మహ్మదుల్లా 26, మిరాజ్‌ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి వన్డేలో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మిరాజ్‌.. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.

నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్‌
ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్‌ మిరాజ్‌ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సరికి మహ్మదుల్లా 21, మిరాజ్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఎట్టకేలకు 100 పరుగుల మార్కు
భారత బౌలర్ల విజృంభణతో టాప్‌, మిడిలార్డర్‌ కుదేలు కాగా.. బంగ్లా 26 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు నష్టపోయి 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఇప్పటి వరకు సుందర్‌కు మూడు, సిరాజ్‌కు రెండు, ఉమ్రాన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. 

సుందర్‌ మ్యాజిక్‌!
18.6: వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతం చేశాడు. ముష్ఫికర్‌ను పెవిలియన్‌కు పంపిన మరుసటి బంతికే అఫిఫ్‌ హొసేన్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో బంగ్లా ఆరో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 19 ఓవర్లలో బంగ్లా స్కోరు: 69-6

ఐదో వికెట్‌ ఢమాల్‌
18.5: ముష్ఫికర్‌ రహీం రూపంలో బంగ్లాదేశ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్‌.. ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సుందర్‌కు ఇది రెండో వికెట్‌.

షకీబ్‌ అవుట్‌!
16.6:
భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్‌ రెండు వికెట్లు కూల్చగా.. ఉమ్రాన్‌ అద్భుత బంతితో షాంటోను బౌల్డ్‌ చేశాడు. ఇక 17వ ఓవర్‌ చివరి బంతికి షకీబ్‌(8)ను అవుట్‌ చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ సైతం ఖాతా తెరిచాడు. దీంతో బంగ్లాదేశ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.  17 ఓవర్లలో బంగ్లా స్కోరు: 66-4

మూడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
52 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగుల చేసిన షాంటోను ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌ‍ల్డ్‌చేశాడు. 

వారెవ్వా సిరాజ్‌ 
బంగ్లాతో రెండో వన్డేలో భారత బౌలర్లు ఆది నుంచి కట్టడిగా బౌలింగ్‌ చేస్తున్నారు. రెండో ఓవర్లోనే వికెట్‌ తీసిన సిరాజ్‌ వికెట్‌.. పదో ఓవర్లో బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ను బౌల్డ్‌ చేశాడు. 

మరోవైపు.. తన మొదటి 2 ఓవర్లలో శార్దూల్‌ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీపక్‌ చహర్‌ 3 ఓవర్లు బౌల్‌ చేసిన 12 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.

రెండో వికెట్‌ డౌన్‌
9.2: సిరాజ్‌ మరోసారి బంగ్లాను దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌(7)ను బౌల్డ్‌ చేసి రెండో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. షకీబ్‌, షాంటో క్రీజులో ఉన్నారు. 

►ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు: 23/1

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లా
1.5: అనముల్ హక్ రూపంలో బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో అనముల్‌(11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షాంటో క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 11-1

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుక్ను బంగ్లాదేశ్‌
టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచింది. తొలి వన్డేలో బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టు... బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపింది. రోహిత్‌ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.

కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌, పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ స్థానంలో కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా కుల్దీప్‌ మొదటి వన్డేతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌- టీమిండియా ఢాకా వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉండగా..  కచ్చితంగా గెలిచి స్వదేశంలో గత సిరీస్‌ ఫలితా‍న్ని పునరావృతం చేయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది.

తుది జట్లు:
భారత్‌:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

బంగ్లాదేశ్‌:
నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్(కెప్టెన్‌), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఇబాదత్‌ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.

చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్‌.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్‌
Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement