గత కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలోకి దిగేందుకు చాహర్ సిద్దమయ్యాడు. దీపక్ చహర్ చివరగా భారత్ తరుపున గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఆడాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేసిన అతడికి వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 2022 ఏడాదిలో కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే భారత్ తరపున ఆడాడు. అదే విధంగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు కూడా చాహర్ దూరమయ్యాడు. ఇక చాహర్ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు విషయాలును పీటీఐతో వెల్లడించాడు.
"నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి గత రెండు మూడు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాను. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే నేను సన్నద్దం అవుతున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండి బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించడమే నా లక్ష్యం. ఏ జట్టుకు ఆడిన 100 శాతం ఎఫక్ట్ పెడతాను. అంతే తప్ప నా గురించి ఎవరు ఏమీ మాట్లాడిన నేను పట్టించుకోను" అని పీటీఐతో దీపక్ చాహర్ పేర్కొన్నాడు.
తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2023 ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ఐపీఎల్–16 ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మే 28న జరుగనుంది.
చదవండి: Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment