చెత్త బౌలింగ్‌తో చిరాకు తెప్పించిన చెన్నై పేసర్లు (Photo Credit: IPL/ BCCI)
IPL 2023- Chennai Super Kings vs Lucknow Super Giants- MS Dhoni Comments: నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా అర్ధ శతకం(31 బంతుల్లో 57 పరుగులు)తో ఆకట్టుకున్నాడు.
మరో ఓపెనర్ డెవాన్ కాన్వే సైతం బ్యాట్ ఝులిపించాడు. కానీ.. హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వాళ్లతో అంబటి రాయుడు(27 నాటౌట్), ఆఖర్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని సిక్సర్లతో చెలరేగడం అభిమానులను ఖుషీ చేసింది. చెపాక్ మైదానంలో తలైవా హిట్టింగ్ ఆడటం వారిని ఆకట్టుకుంది. అంతా బాగానే ఉంది. సీఎస్‌కే మంచి స్కోరే సాధించింది.
భయపెట్టిన మేయర్స్
ఇక మిగిలింది లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేయడమే అని అభిమానులు కాస్త కూల్‌గానే ఉన్నారు. కానీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఓపెనర్ కైలీ మేయర్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ధోని బౌలర్లను మారుస్తున్నా అతడిలో వేగం తగ్గలేదు.
చెత్త బౌలింగ్
పైగా తుషార్ దేశ్‌పాండే, దీపక్ చహర్ వైడ్‌లు, నోబాల్స్ రూపంలో చెత్త బౌలింగ్‌తో ధోనితో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులకు కూడా చిరాకు తెప్పించారు. అయితే, మొయిన్ అలీ అద్భుత బంతితో మేయర్స్‌ను ట్రాప్ చేశాడు. మేయర్స్ ఇచ్చిన క్యాచ్‌ను కాన్వే ఒడిసిపట్టడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
దీంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. ఇక ఆ తర్వాత ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది. 12 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే, ఈ గెలుపు పట్ల సంతోషపడిన ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
అంతేకాదు.. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా పేసర్లను ఉద్దేశించి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో చెన్నై బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులు ఇవ్వడం.. అందులో 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉండటం ధోని అసంతృప్తికి కారణం.
ఇంకోసారి నోబాల్స్, వైడ్లు వేస్తే
ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో కూడా ఓ కన్నేసి ఉంచాలి. నోబాల్స్, ఎక్స్‌ట్రా వైడ్స్ అస్సలు ఉపేక్షించలేం.
ఇది ఇలాగే కొనసాగితే వాళ్లు కొత్త నాయకుడి నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్’’ అంటూ పేసర్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక వికెట్ తమను పూర్తిగా ఆశ్చర్యపరిచిందన్న ధోని.. స్లోగా ఉంటుందనుకుంటే.. పరుగుల వరద పారిందని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్ చహర్ తన కోటా పూర్తి చేసి 55 పరుగులు ఇవ్వగా.. తుషార్ 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.
చదవండి: ఈ మాత్రం ఆటకి 16 కోట్లు దండగ! ఒక్క సిక్సర్ కూడా లేదు! సెట్ కాడు
IPL 2023: కేకేఆర్‌కు షాకిచ్చిన బంగ్లా బోర్డు! తప్పుకొన్న షకీబ్.. ఆ స్టార్ బ్యాటర్ కూడా
#CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. 😁😆#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK
— IndianPremierLeague (@IPL) April 3, 2023
Comments
Please login to add a commentAdd a comment