
PIC Credit: IPL Twitter
ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో సంబురాల్లో మునిగితేలుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గాయం తిరగబెట్టడంతో తదుపరి సీఎస్‌కే ఆడబోయే 4-5 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నిన్న (ఏప్రిల్ 8) ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం (లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్) తిరగబెట్టడడంతో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేయగలిగిన చాహర్.. అది వేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.
గాయాల కారణంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయిన సీఎస్‌కేకు చాహర్ గాయంం మరింత కలవరానికి గురి చేస్తుంది. చాహర్ గత సీజన్లోనూ ఇలాగే మధ్యలోనే వైదొలిగి, సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు. ప్రస్తుతానికి సీఎస్‌కే ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, చాహర్ అందుబాటులో ఉండడన్న విషయం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత రవీంద్ర జడేజా బంతితో (4-0-20-3) ఇరగదీయగా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో వెటరన్ రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రహానేకు రుతురాజ్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకలవడంతో సీఎస్‌కే 18.1 ఓవర్ల సునాయాసంగా లక్ష్యాన్ని (158) ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment