Ind Vs Wi Series: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఫామ్‌లేని ఆటగాళ్లను నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలన్నారు. వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేయాలని సూచించారు. ఇక వెస్టిండీస్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు స్పోర్ట్స్‌తో మాట్లాడిన గావస్కర్... ‘‘భువనేశ్వర్ కుమార్.... అతడి బౌలింగ్‌లో మునుపటి పస లేదు. పేస్‌లో పదును లేదు. భువీకి భవిష్యత్తు ఉందని అనిపించడం లేదు. అతడు మళ్లీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. భువనేశ్వర్ బ్రేక్ తీసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఇక భువీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్ ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయన్న అంశం గురించి గావస్కర్ చెబుతూ... ‘‘దీపక్ చహర్‌కు మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి.
ఈ యువ ఆటగాడు అద్భుతంగా బంతిని స్వింగ్ చేయగలడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. భువీ స్థానంలో చహర్‌ను తుది జట్టులో ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాగా ఫిబ్రవరి 6 నుంచి విండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు అహ్మదాబాద్‌కు పయనమయ్యారు. ఇక ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌తో విజయంతో జోరు మీదున్న పొలార్డ్ బృందం త్వరలోనే భారత్ చేరుకోనుంది. కాగా విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు దీపక్ చహర్ ఎంపిక కాగా.. భువీ కేవలం టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్
IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్‌కోచ్
Comments
Please login to add a commentAdd a comment