దీపక్ చహర్
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..
అతడిని పట్టించుకోలేదు
‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా.
అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్‌కప్ జట్టులో ఉమ్రాన్‌కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు.
ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా!
గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు.
అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్‌గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్‌గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు.
చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే
నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా
Comments
Please login to add a commentAdd a comment