Ind vs WI 3rd T20I: Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar's All-Time Record - Sakshi
Sakshi News home page

IND vs WI: కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర.. తొలి భారత బౌలర్‌గా!

Published Wed, Aug 9 2023 1:35 PM | Last Updated on Wed, Aug 9 2023 2:54 PM

Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar all time record - Sakshi

కరేబియన్‌ గడ్డపై టీమిండియా వెటరన్‌ ​కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి తన స్పిన్‌ మయాజాలాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శరన కనబరిచిన కుల్దీప్‌ యాదవ్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ అధిక్యాన్ని 1-2కు భారత్‌ తగ్గించింది.

కుల్దీప్‌ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్క్‌ను అందుకున్న భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 30 మ్యాచ్‌ల్లో కుల్దీప్‌ ఈ ఫీట్‌ సాధించాడు. అంతకముందు ఈ రికార్డు యజువేంద్ర చహల్‌ పేరిట ఉండేది. చాహల్‌ 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో చాహల్‌ రికార్డును కుల్దీప్‌ బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా టీ20ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా కుల్దీప్‌ నిలిచాడు. విండీస్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌.. 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెటరన్‌ పేపసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రికార్డును యాదవ్‌ బ్రేక్‌ చేశాడు. భువీ 18 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
చదవండిYashasvi Jaiswal: ఇషాన్‌ను కాదని నిన్ను ఆడిస్తే ఏం చేశావు? అప్పుడు సెంచరీ.. ఇప్పుడు రెండు సున్నాలు తగ్గాయంతే! ఫ్యాన్స్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement