కొలంబో: రెండో వన్డేలో శ్రీలంకపై టీమిండియా విక్టరీ తర్వాత అభిమానులు చేసిన మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దీపక్ చహర్, భువనేశ్వర్‌ల ఇన్నింగ్స్, లంక ఓటమి, భువీ 3093 బంతుల తర్వాత మళ్లీ నో బాల్ సంధించడం లాంటి విషయాలపై ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి. దీపక్ చహర్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్‌ను '' ధావన్ కెప్టెన్సీలో ధోని అంటూ.. 3093 బంతుల తర్వాత భువీ నోబాల్ వేయడాన్ని (3093-1).. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అండర్ టేకర్ వ్రెసల్‌మేనియా విజయాలతో పోల్చుతూ.. కామెంట్లు పెట్టారు. వీలైతే మరు ఒక లుక్కేయండి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది.
#INDvSL
— बिहारी 🖤🥀 (@Shitt_posterr) July 20, 2021
Bhubaneswar Kumar Overstepped After 3093Balls
Meanwhile Bumrah:- pic.twitter.com/5LxhjHs5m0
Deepak Chahar under Dhawan's captaincy.#INDvSL pic.twitter.com/7hYRdY66mf
— ᵃ (@aqqu___) July 20, 2021
Mickey Arthur In Last 5 Overs :-#INDvSL pic.twitter.com/mqBKZkncfR
— Sami.Sajjad (@SamiSajjad15) July 20, 2021
Deepak Chahar entering into dressing room be like 👏 #INDvSL pic.twitter.com/is62dgLlgQ
— Prince Pandey🍁🦜 (@princepandey_) July 20, 2021
Comments
Please login to add a commentAdd a comment