Deepak Chahar Marriage With Girlfriend Jaya Bhardwaj, Wedding Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Deepak Chahar Marriage: వైభవంగా టీమిండియా క్రికెటర్‌ పెళ్లి.. ఫోటోలు వైరల్‌

Published Thu, Jun 2 2022 9:16 AM | Last Updated on Thu, Jun 2 2022 3:40 PM

Deepak Chahar Ties The Knot With Girlfriend Jaya Bhardwaj Pics Viral - Sakshi

టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ చహర్‌ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్‌ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు. ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో బుధవారం అర్థరాత్రి దాటిన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం తమ వెడ్డింగ్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన దీపక్‌ చహర్‌.. ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చాడు.

''జయా భరద్వాద్‌.. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నువ్వే నాకు కరెక్ట్‌ అనే ఫీలింగ్‌ కలిగింది. ఇప్పటివరకు మన జీవితంలో జరిగిన ప్రతీ మూమెంట్‌ను ఆనందంగా ఎంజాయ్‌ చేశాం. పెళ్లితో ఒక్కటైన మనం.. ఇకపై కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఆనందంగా ఉంచుతానని ప్రామిస్‌ కూడా చేస్తున్నా. నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌ ఇదే. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి'' అంటూ పేర్కొన్నాడు.

కాగా దీపక్‌ చహర్‌ అర్థాంగి జయా భరద్వాజ్‌ ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో కార్పోరేట్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. కాగా జయా భరద్వాజ్‌ సోదరుడు బిగ్‌బాస్‌ ఫేమ్‌ సిద్ధార్థ్‌ భరద్వాజ్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దీపక్‌ చహర్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపక్‌ చహర్‌- జయా భరద్వాజ్‌ల రిసెప్షన్‌ వేడుక ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లోని కమల్‌ మహల్‌లో నిర్వహించనున్నారు.

చదవండి: Deepak Chahar: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్‌.. శుభలేఖ వైరల్‌..!


ఈ వేడుకకు సీఎస్‌కే టాప్‌ స్టార్స్‌ సహా కోహ్లి, అనుష్క దంపతులు హాజరుకానున్నారు. రిపోర్ట్స్‌ ప్రకారం 60 మంది క్రికెటర్లు ఆహ్వానాలు పంపారని.. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, టీమిండియా స్టార్‌ విరాట్‌​ కోహ్లి సహా మరికొంతమంది హాజరుకానున్నారు.


ఇక గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లోనే దీపక్‌ చహర్‌ తన ప్రేయసికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న జయా భరద్వాజ్‌ వద్దకు వచ్చి లవ్‌ ప్రపోజ్‌ చేసిన దీపక్‌ చహర్‌ ఆమె చేతికి రింగ్‌ను తొడిగాడు. మొదట షాక్‌ తిన్నప్పటికి జయా భరద్వాజ్‌ దీపక్‌ లవ్‌ప్రపోజ్‌ను ఎంతో ఇష్టంతో స్వీకరించింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లోనే వైరల్‌ అయింది.ఇక గాయం కారణంగా దీపక్‌ చహర్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్‌ మెగావేలంలో దీపక్‌ చహర్‌ను రూ 14 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది సీజన్లో సీఎస్‌కే విజేతగా నిలవడంతో దీపక్‌ చహర్‌ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోని సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

చదవండి: Deepak Chahar: వైభవంగా దీపక్‌ చహర్‌ పెళ్లి వేడుక.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన పెళ్లి కొడుకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement