
రంజీ ట్రోఫీ 2022 భాగంగా మధ్యప్రదేశ్, ముంబై మధ్య జరుగుతున్న ఫైనల్ ఆసక్తికరంగా మారింది. మధ్య ప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోపీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్య ప్రదేశ్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులకు ఆలౌటైంది. ముగ్గరు మధ్య ప్రదేశ్ ఆటగాళ్లు(రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యష్ ధూబేలు) సెంచరీలతో చెలరేగడంతో మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం ద్వారా మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించనుంది. ఇంతకముందు 1998-99 రంజీ సీజన్‌లో మధ్య ప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ను ఆట ఆఖరి రోజున చూసేందుకు వచ్చిన సీఎస్‌కే స్టార్ దీపక్ చహర్‌కు వింత అనుభవం ఎదురైంది.
మ్యాచ్ చూసేందుకు స్టాండ్స్‌లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకులు.. సీఎస్‌కే.. సీఎస్‌కే అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. చహర్ కూడా చిరునవ్వుతో అక్కడున్న ప్రేక్షకులని కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీపక్ చహర్ గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరమయ్యాడు. మెగావేలంలో రూ.14 కోట్లకు దీపక్ చహర్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉంటున్నాడు.
Look who's here! pic.twitter.com/AkXyy7mor2
— cricket fan (@cricketfanvideo) June 25, 2022