రంజీ ట్రోపీ 2022 సీజన్‌లో భాగంగా ముంబైతో జరుగుతున్న ఫైనల్లో మధ్య ప్రదేశ్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఓపెనర్ యష్ దూబే 366 బంతుల్లో 133, 14 ఫోర్లు), శుభమ్ ఎస్ శర్మ(215 బంతుల్లో 116, 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలో చెలరేగారు. ఆట ముగిసే సమయానికి రజత్ పాటిదార్ 67 బ్యాటింగ్, కెప్టెన్ ఆదిత్య శ్రీ వాత్సవ 11 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు.
మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే ఇంకా ఆరు పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. నాలుగో రోజు ఆటలో మధ్య ప్రదేశ్ భారీ ఆధిక్యం సాధిస్తుందా లేక చతికిలపడుతుందా అన్నది వేచి చూడాలి. అంతకముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయింది.
That's Stumps on Day 3 of the @Paytm #RanjiTrophy #Final! #MPvMUM
— BCCI Domestic (@BCCIdomestic) June 24, 2022
Madhya Pradesh ended the Day at 368/3.
Mumbai scalped a wicket each in the 2nd & 3rd Session.
We will be back for the Day 4 action tomorrow.
Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/Xoszp8yKmI
Comments
Please login to add a commentAdd a comment