సీఎస్‌కేకు సపోర్ట్‌ చేసిన ఈ మోడల్‌ ఎవరో తెలుసా?‌ | IPL 2021: CSK Pacemans Sister Supports MS Dhonis Side | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేకు సపోర్ట్‌ చేసిన ఈ మోడల్‌ ఎవరో తెలుసా?‌‌

Published Thu, Apr 22 2021 6:13 PM | Last Updated on Thu, Apr 22 2021 8:44 PM

IPL 2021: CSK Pacemans Sister Supports MS Dhonis Side - Sakshi

ముంబై:  మాలతీ చహర్‌.. దీపక్‌ చహర్‌ అక్క. ఈమె సీఎస్‌​కేకు వీరాభిమాని. గత సీజన్లలో కూడా సీఎస్‌కేకు సపోర్ట్‌ చేసింది మాలతీ.  సీఎస్‌కే ఆడే మ్యాచ్‌లకు తరచు హాజరై సందడి చేసింది. అప్పుడే ఈ అమ్మాయి ఎవరు అని కెమెరాకు చిక్కగా ఆమె దీపక్‌ చహర్‌కు సిస్టర్‌ అని తేలింది.  మోడలింగ్‌ రంగంలో రాణిస్తున్న మాలతీ త్వరలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  

కరోనా కారణంగా ఈ సీజన్‌లో స్టేడియాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎస్‌కేపై తన అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. యెల్లో స్కర్ట్‌, కాళ్లకు ప్యాడ్లు, చేతిలో యెల్లో కలర్‌లో ఉన్న బాటన్‌ పట్టుకుని ఉన్న ఫోటోను సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకు విపరీతమైన లైక్‌లు రావడమే కాకుండా సీఎస్‌కే ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. బుధవారం(ఏప్రిల్‌ 21వ తేదీ) కేకేఆర్‌-సీఎస్‌కేల మ్యాచ్‌కు ముందు ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు మాలతీ చహర్‌. నిన్నటి మ్యాచ్‌లో తమ్ముడు దీపక్‌ చహర్‌ నాలుగు వికెట్లు రాణించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement